హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖలో  ప్రభుత్వం  బుధవారం నాడు ఉదయం బదిలీ చేసింది. జైళ్ల శాఖ డీజీగా ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ త్రివేదిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

 తెలంగాణ రాష్ట్రంలో  జైళ్ల శాఖలో రెండు మాసాల వ్యవధిలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు  బదిలీ అయ్యారు. జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు నిర్వహించిన ఇద్దరిని తెలంగాణ ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రెండు మాసాల క్రితం జైళ్ల శాఖ డీజీపీగా ఉన్న వీకే సింగ్‌ను కేసీఆర్ ప్రభుత్వం అర్ధరాత్రి బదిలీ చేసింది.ఆ సమయంలో వీకే సింగ్ వ్యవహారశైలిపై పెద్ద దుమారం రేగడంతో ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

జైళ్ల శాఖ డీజీగా ఉన్న వీకే సింగ్ అప్పట్లో మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. మరో వైపు వీకే సింగ్ ‌ను బదిలీ చేయడంతో ఆయన స్థానంలో సందీప్ శాండిల్యను రెండు మాసాల క్రితం ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకొంది.

తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీగా సందీప్ శాండిల్య డీజీపీగా రెండు మాసాల క్రితం నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయనను బదిలీ చేశారు. ఆయన స్థానంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదిని జైళ్ల శాఖ డీజీగా నియమించారు. సందీప్ శాండిల్యకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.

జైళ్ల శాఖలో ఎందుకు ఆకస్మిక బదిలీలు చేపట్టారనే విషయమై ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ సాగుతోంది. గతంలో జైళ్ల శాక డీజీగా ఉన్న వీకే సింగ్ ను అర్ధరాత్రి పూట బదిలీ చేస్తే సందీప్ శాండిల్యను బుధవారం నాడు ఉదయమే బదిలీ చేశారు. జైళ్ల శాఖలోనే ఆకస్మికంగా బదిలీలు చేయడం వెనుక ఆంతర్యమేమిటనే విషయమై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 

Read more పోలీస్ అకాడమీ వేస్ట్: డైరెక్టర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు ..