Asianet News TeluguAsianet News Telugu

గుడ్‌‌న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ మరోసారి గడువు పొడిగించిన తెలంగాణ సర్కార్


వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి తెలంగాణ ప్రభుత్వం  పొడిగించింది.

telangana government another time extends discount on pending challans lns
Author
First Published Jan 31, 2024, 4:57 PM IST

హైదరాబాద్: వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి తెలంగాణ ప్రభుత్వం  పొడిగించింది.ఈ మేరకు  బుధవారం నాడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.  ఈ ఏడాది ఫిబ్రవరి  15 వ తేదీ వరకు  పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు  ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.  ఇప్పటికే  ఒక్కసారి  గడువును పొడిగించింది.ఇవాళ్టితో గడువు ముగియనుంది. దీంతో  గడువును వచ్చే నెల  15వ తేదీ వరకు  పెంచింది  సర్కార్. 

also read:గుడ్‌‌న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు

2023  డిసెంబర్  26వ తేదీన  పెండింగ్ చలాన్లపై రాయితీని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.  2024 జనవరి 10వ తేదీన  గడువును ఇచ్చింది. అయితే ఈ నెల  10వ తేదీన  తొలిసారి గడువును పెంచింది.  ఇవాళ్టి వరకు  గడువును పొడిగించింది.  అయితే ఇవాళ  గడువును మరోసారి పెంచుతూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ద్విచక్రవాహనాలు, మూడు చక్రాల వాహనాలపై  80 శాతం, కార్లపై  50 శాతం , హెవీ వెహికిల్స్ పై 60 శాతం రాయితీ ప్రకటించింది.  2022లో  పెండింగ్ చలాన్ల ద్వారా  ప్రభుత్వానికి రూ. 300 కోట్ల ఆదాయం వచ్చింది.  ఈ నెల  10వ తేదీ నాటికి  రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 107 కోట్ల ఆదాయం లభించింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios