గుడ్‌న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
పెండింగ్ లోని ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్ విధానానికి ప్రభుత్వానికి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది.
హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెలాఖరు వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.2023 డిసెంబర్ 26వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్ల రాయితీ ఇస్తున్నట్టుగా గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు గడువును పొడిగించింది ప్రభుత్వం.
also read:పెండింగ్ చలాన్లపై నేటీనుండే రాయితీ: తెలంగాణ సర్కార్ జీవో జారీ
టూ వీలర్స్, మూడు చక్రాల వాహనాలపై 80 శాతం, కార్లపై 50 శాతం, హెవీ వెహికల్స్ పై 60 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది తెలంగాణ సర్కార్.
also read:జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్
2022లో పెండింగ్ చలాన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ . 300 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 107 కోట్ల ఆదాయం వచ్చింది. పెండింగ్ లో ఉన్న చలాన్లు ఇంకా రెండు కోట్ల వరకు ఉన్నాయి.దీంతో గడువును పెంచింది ప్రభుత్వం. మరో వైపు సైబర్ నేరగాళ్లు పెండింగ్ చలాన్ల కోసం ఫేక్ వెబ్ సైట్ ను క్రియేట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచించిన విషయం తెలిసిందే.