Asianet News TeluguAsianet News Telugu

మలక్‌పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి: రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  ఇద్దరు బాలింతల మృతికి నిరసనగా  కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు.   మృతుల కుటుంబాలకు  ప్రభుత్వం  రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను  ప్రకటించింది.  

Telangana  Government  Annouces  Rs. 5 lakh to  deceased families  in malakpet  hospital case
Author
First Published Jan 13, 2023, 5:17 PM IST

హైదరాబాద్: నగరంలోని మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిన  బాలింతల కుటుంబాలకు  రూ. 5 లక్షల చొప్పున  ఆర్ధిక సహాయం అందించడానికి  ప్రభుత్వం  అంగీకరించింది.  రూ. 4 లక్షలను కుటుంబ సంక్షేమ శాఖ  నుండి 
అందించనున్నారు. మిగిలిన లక్ష రూపాయాలను  ఆయా జిల్లాల కలెక్టర్లు అందించనున్నారు. 

also read:మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతిపై విచారణ: హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్

మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  డెలీవరీ కోసం  అడ్మిట్  అయిన  ఇద్దరు మహిళలు  మృతి చెందారు.  సిరివెన్నెల, శివానీల అనే ఇద్దరు  మహిళలు  ఈ ఆసుపత్రిలో  సిజేరియన్ పూర్తయ్యాయ  వేర్వేరు కారణాలతో  మృతి చెందారు. ఈ ఇద్దరి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని  మృతుల కుటుంబసభ్యులు  ఆఆరోపించారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతూ  ఆసుపత్రి ముందు  ఆందోళనకు దిగారు. ఆందోళనకారులకు  పలు రాజకీయపార్టీలు మద్దతు ప్రకటించాయి.  మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఈ విషయమై  వైద్య ఆరోగ్య శాఖాధికారులతో  మాట్లాడారు.  మృతి చెందిన రెండు కుటుంబాలకు  ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని  ప్రభుత్వం హామీ ఇచ్చింది.  ఈ మేరకు  రాష్ట్రప్రభుత్వ వైద్య శాఖ కమిషనర్ అజయ్ కుమార్  ఈ మేరకు హామీ ఇచ్చారు. ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆసుపత్రి వద్ద  ఆందోళన నిర్వహిస్తున్న  బీఎస్ పీ  సహ పలు పార్టీల శ్రేణులను పోలీసులు  అరెస్ట్  చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios