Asianet News TeluguAsianet News Telugu

మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతిపై విచారణ: హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్

మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  ఇద్దరు బాలింతల మృతిపై  విచారణకు  కమిటీని  ఏర్పాటు  చేసినట్టుగా రాష్ట్ర హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్ ప్రకటించారు

Telangana Health  Commissioner  Ajay kumar Orders  to  inquiry  on  two  women  death  in  Malakpet  hospital
Author
First Published Jan 13, 2023, 3:45 PM IST

హైదరాబాద్: మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  ఇద్దరు బాలింతల మృతిపై  విచారణకు కమిటీని ఏర్పాటు  చేసినట్టుగా  తెలంగాణ రాష్ట్ర హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్ ప్రకటించారు. 

మలక్ పేట  ప్రభుత్వాసుపత్రిలో ఘటనపై  దర్యాప్తు నివేదిక ప్రకారంగా  బాధ్యులపై చర్యలు తీసుకుంటామని  అజయ్ కుమార్  చెప్పారు. మలక్ పేట  ప్రభుత్వాసుపత్రిలో  ఈ ఇద్దరు బాలింతలకు సర్జరీ జరిగిన రోజే  మరో 11 మందికి సర్జరీలు  జరిగినట్టుగా అజయ్ కుమార్ వివరించారు.  ఈ ఇధ్దరు మినహా మిగిలినవారంతా  ఆరోగ్యంగానే  ఉన్నారన్నారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు పునరావృతం కాకుండా  చర్యలు తీసుకుంటామని  ఆయన  హామీ ఇచ్చారు. 

also read:మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి:: బంధువుల ఆందోళన, ఉద్రిక్తత

మలక్ పేట  ప్రభుత్వాసుపత్రిలో  సిజేరియన్ ఆపరేషన్లు జరిగిన  తర్వాత  సిరివెన్నెల , శివానీలు మృతి చెందారు. సిరివెన్నెల  రెండో కాన్పు కోసం  మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  చేరింది. శివానీ తొలి కాన్పు కోసం  మలక్ పేట ఆసుపత్రిలో  చేరింది.  సిజేరియన్లు  జరిగిన తర్వాత వీరిద్దరూ  మృతి చెందారు . ఈ ఇద్దరి మృతికి  వైద్యుల నిర్లక్ష్యం కారణమని  మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. అయితే  వీరిద్దరి మరణానికి  వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని  డీసీహెచ్ డాక్టర్ సునీత ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios