Asianet News TeluguAsianet News Telugu

ఈ అభివృద్ధి భట్టి విక్రమార్కకు కనిపించడం లేదా: లెక్కలతో చెప్పిన హరీశ్

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు ఆర్ధిక మంత్రి హరీశ్ రావు లెక్కలతో సహా అభివృద్ధి వివరాలను తెలియజేశారు

telangana finance minister harish rao speech in assembly budget session 2020
Author
Hyderabad, First Published Mar 12, 2020, 3:12 PM IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు ఆర్ధిక మంత్రి హరీశ్ రావు లెక్కలతో సహా అభివృద్ధి వివరాలను తెలియజేశారు తెలంగాణ ఏర్పడిన సమయంలో ఉత్పత్తి అయిన ధాన్యం విలువ రూ.9,270  కోట్లయితే ప్రస్తుతం అది రూ.40 వేల కోట్లకు చేరిందన్నారు మంత్రి హరీశ్ రావు.

గురువారం తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల కింద పేదలకు ఇచ్చిన డబ్బు రూ. 5,558 కోట్లని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ ఆసరా పెన్షన్ల మీద పెట్టిన ఖర్చు రూ.42,470 కోట్లని హరీశ్ తెలిపారు.

Also Read:గోపన్‌పల్లి భూములపై ప్రభుత్వం చర్యలు : మండలిలో మంత్రి ప్రశాంత్

ఈ గణాంకాలు నక్కకు నాగలోకానికి వున్నంత తేడాను చూపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమంపై కేసీఆర్ సర్కార్ పెట్టిన ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కనిపించడం లేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ఇదే సమయంలో పశు సంవర్థక శాఖపై ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన ఖర్చు రూ. 5,324 కోట్లని, గొర్రెలు, బర్రెలు, పాల సబ్సిడీ తదితర రంగాలపై తమ ప్రభుత్వం రూ.5,035 కోట్లు రూపాయలని హరీశ్ రావు గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగంపై పెట్టిన ఖర్చు రూ.5,644 కోట్లని, కానీ తమ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలోనే రూ.4,389 కోట్లు ఖర్చు చేశామన్నారు. పదేళ్ల కాలంలో సింగరేణి గనుల్లో చేసిన ఉత్పత్తి 4,519 లక్షల టన్నులని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 3,006 లక్షలు టన్నులని హరీశ్ గుర్తుచేశారు.

తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పదేళ్ల కాలంలో వచ్చిన రాయల్టీ రూ.9,573 కోట్లని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రూ.13,105 కోట్లు వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు 20 శాతం బోనస్ ఇస్తే, కేసీఆర్ 28 శాతం బోనస్ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఎండిపోయిన వరి కంకులు, ఖాళీ బిందెలు లేకుండా ఉండేదికాదని హరీశ్ గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు స్థాపిత విద్యుత్  7,778 మెగావాట్లని ఇది ప్రస్తుతం 16,246 మెగావాట్లకు పెంచుకున్నామని భద్రాద్రి, యాదాద్రి యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని మంత్రి గుర్తుచేశారు.

Also Read:సోనియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ: మతలబు ఏమిటి?

23 జిల్లాల్లో కలిపి వచ్చిన విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లని, కానీ ఈ మధ్యకాలంలో 13,168 మెగావాట్ల డిమాండ్ వచ్చిందని.. ఈ స్థాయిలో డిమాండ్ వున్నప్పటికీ ఒక్క సెకను కూడా విద్యుత్ కోతలు లేవన్నారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లని, ప్రస్తుతం ఇది 1,896 యూనిట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. నాణ్యమైన విద్యుత్ ఇచ్చే అంశంలో 93 పాయింట్లతో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని హరీశ్ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios