Asianet News TeluguAsianet News Telugu

బీడీ ఆకుపై జీఎస్టీ వద్దు : కేంద్రాన్ని కోరిన మంత్రి హరీశ్ రావు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా టీడీఎస్ ట్రాన్స్‌పోర్టుకు, బీడీ ఆకుపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. 

telangana finance minister harish rao participated in gst council meeting
Author
First Published Dec 17, 2022, 5:15 PM IST

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 46000 జలాశయాలు వున్నాయని.. వీటి నిర్వహణ, మరమ్మత్తుల పనులను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఆయన ప్రధానంగా కోరారు. అలాగే టీడీఎస్ ట్రాన్స్‌పోర్టుకు, బీడీ ఆకుపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. అయితే ట్యాక్స్ ఇన్‌వాయిస్ రూల్స్ సవరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రకటించారు. 

మరోవైపు.. ఇథనాల్‌పై జీఎస్టీ తగ్గిస్తూ.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇథనాల్‌పై 18 నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించింది. ఆన్‌లైన్‌ గేమింగ్ , రేసింగ్ , క్యాసినో‌లపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. మరోవైపు మైనర్ ఇరిగేషన్ , పీడీఎస్ సంబంధిత సేవలైన కస్టం బిల్లింగ్ , బీడీ ఆకులపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్‌లో తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పూర్తి పరిశీలన నిమిత్తం ఫిట్‌మెంట్ కమిటీకి జీఎస్టీ మండలి సిఫారసు చేసింది. 

ALso REaed:నేడు వర్చువల్ సమావేశం నిర్వహించనున్న జీఎస్టీ కౌన్సిల్.. కీల‌క అంశాలు ప‌రిశీలిస్తున్న కేంద్రం

కాగా, అంత‌కుముందు ఈ  ఏడాది జూన్ నెల‌లో 28 నుంచి 29 వరకు చండీగఢ్ లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. గత నెలలో పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ముఖ్య సలహాదారుగా ఉన్న మిత్రా..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు రాసిన లేఖలో ప్రవర్తనా నియమాల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కావాలని చెప్పారు. 

గత సమావేశంలో ఎల్ఈడీ ల్యాంపులు, సోలార్ వాటర్ హీటర్లు వంటి వివిధ వస్తువులపై జీఎస్టీని కౌన్సిల్ పెంచింది. టెట్రా ప్యాక్లపై జీఎస్టీని 12 శాతం నుండి 18 శాతానికి పెంచింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసిన రేటు మార్పులు జూలై 18, 2022 నుండి అమలులోకి వచ్చాయి. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోల పన్నులను పరిశీలించడానికి జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రాష్ట్రాల మంత్రుల ప్యానెల్ గురువారం తన నివేదికను సీతారామన్ కు సమర్పించింది. శనివారం జరిగే సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ ఈ నివేదికను తీసుకునే అవకాశం ఉంది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ప్యానెల్ నవంబర్ లో సమావేశమై ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు రేసింగ్ పై 28 శాతం జీఎస్టీని అంగీకరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios