Asianet News TeluguAsianet News Telugu

క్వారంటైన్ లో మంత్రి హరీష్ రావు!

తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యక్తిగత సహాయకునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మంత్రికి ఆయన వెంట ఉండే 51 మంది సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు. 51 మందిలో 17 మంది ఫలితాలు వచ్చాయి. మంత్రితోసహా మరో 17 మందికి నెగటివ్ అని వచ్చింది. 

Telangana Finance minister Harish Rao In Home Quarantine
Author
Hyderabad, First Published Jun 13, 2020, 12:11 PM IST

తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యక్తిగత సహాయకునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మంత్రికి ఆయన వెంట ఉండే 51 మంది సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు. 51 మందిలో 17 మంది ఫలితాలు వచ్చాయి. మంత్రితోసహా మరో 17 మందికి నెగటివ్ అని వచ్చింది. 

ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లోని తన నివాసంలో సెల్ఫ్  క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ సోకిన ప్రజలకు ట్రీట్మెంట్ ని అందిస్తూ వారిని కాపాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందే కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణాలో కరోనా వైరస్ బారినపడ్డ డాక్టర్ల సంఖ్య 100 దాటింది. 

నిన్నొక్కరోజే ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలో ఎంఎస్ చదువుతున్న ఇద్దరు పీజీ విద్యార్థులకు, ప్లాస్టిక్ సర్జరీలో పీజీ సూపర్ స్పెషలిటీ చేస్తున్న ఇద్దరికి, ఒక ఇంటర్న్, ఒక బిడిఎస్ ఇంటర్న్ కి కరోనా వైరస్ సోకింది. వీరందరితో కలిపి ఉస్మానియాలో 63 మందికి కరోనా సోకింది. 

ఇక ప్రధాన మెడికల్ కాలేజీల పరిధిలో గనుక తీసుకుంటే... గాంధీలో ఇప్పటివరకు 5గురు డాక్టర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. నిమ్స్ లో 23 మంది డాక్టర్లు, 20 మంది వైద్య సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. 

మొత్తంగా హైదరాబాద్ లోని ఈ మూడు ఆసుపత్రుల పరిధిలోనే 100 కేసులు దాటాయి. ఇంత జరుగుతున్నప్పటికీ... టెస్టింగును మాత్రం పెంచడం లేదు తెలంగాణ ప్రభుత్వం అని వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

ఇకపోతే.... తెలంగాణలో కరోనా విలయతాండవం జరిగింది. శుక్రవారం కొత్తగా 164 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,035కి చేరింది. శుక్రవారం మరో 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 174కి చేరుకుంది.

రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,032 కాగా, 2,278 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 133 కేసులు నమోదవ్వగా... మేడ్చల్ 06, రంగారెడ్డి 6, సంగారెడ్డి 3, నిజామాబాద్ 3, మహబూబ్‌నగర్, కరీంనగర్, ములుగుల్లో రెండేసి కేసుల చొప్పున సిద్ధిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, వనపర్తిలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

Also Read:బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి చెందిన 10 మంది పోలీసులకు కరోనా

అటు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 10,956 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. కాగా నిన్న ఒక్కరోజే  396 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios