హైదరాబాద్: తెలంగాణలో ఉత్కంఠంగా జరిగిన పోలింగ్ ముగిసింది. దీంతో తెలంగాణ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ సిక్స్ సర్వే ఎక్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఆ ఫలితాలు చూద్దాం.

టీఆర్ఎస్...............................................66

ప్రజాకూటమి.........................................37

బీజేపీ......................................................7

 ఇతరులు...............................................9

టైమ్స్ నౌ సిఎన్ ఎక్స్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ పార్టీదే హవా కనబరిచింది. టీఆర్ఎస్ పార్టీ, మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి 66 స్థానాలతో మళ్లీ అధికారాన్ని చేజిక్కుంచుకుంటున్నట్లు తన సర్వేలో తేలినట్లు ప్రకటించింది. 

మరోవైపు గట్టిపోటీ ఇచ్చిన ప్రజాకూటమి కేవలం 37 స్థానాలకే పరిమితం చేసింది. అటు బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. అలాగే ఇతరులు 9 మంది విజయం సాధించొచ్చు అని తన సర్వేలో ప్రకటించింది. 

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. శాసనసభలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు, ప్రజా కూటమికి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కాంగ్రెసు నేతృత్వంలో తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి (టీజెఎస్)లతో కలిపి ప్రజా కూటమి ఏర్పడింది.

బిజెపి ఒంటరిగా పోటీ చేసింది. రాష్ట్రంలోని 109 స్థానాలకు ఆ పార్టీ పోటీ చేసింది. కాగా, సిపిఎం నేతృత్వంలో బిఎల్ఎఫ్ కూడా పోటీ చేసింది. మజ్లీస్ హైదరాబాదులో ముఖ్యంగా పోటీ లో ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆరా న్యూస్ తెలంగాణ ఎగ్జిట్ పోల్: కారు దే జోరు

ఇండియా టూడే తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: దూసుకుపోయిన కారు

రిపబ్లిక్ టీవీ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరా హోరీ

రిపబ్లికన్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: కేసీఆర్ దే హవా

సీఎన్ఎన్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటా పోటీ