హైదరాబాద్: తెలంగాణ  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  సిఎన్ఎన్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో   టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటా పోటీ ఉంటుందని ఈ సర్వే తేల్చింది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. శాసనసభలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు, ప్రజా కూటమికి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. 

కాంగ్రెసు నేతృత్వంలో తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి (టీజెఎస్)లతో కలిపి ప్రజా కూటమి ఏర్పడింది.

బిజెపి ఒంటరిగా పోటీ చేసింది. రాష్ట్రంలోని 109 స్థానాలకు ఆ పార్టీ పోటీ చేసింది. కాగా, సిపిఎం నేతృత్వంలో బిఎల్ఎఫ్ కూడా పోటీ చేసింది. మజ్లీస్ హైదరాబాదులో ముఖ్యంగా పోటీ లో ఉంది.

ఈ ఎన్నికల్లో  ఆరు జాతీయ పార్టీలు పోటీలో ఉన్నాయి.  119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  1821 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 30 ప్రాంతీయ పార్టీలు ఈ పోలింగ్ లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి.  

652 మంది  అభ్యర్థులకు క్రిమినల్ రికార్డ్స్ ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉన్న 69 మంది అభ్యర్థులకు క్రిమినల్ రికార్డులున్నాయి, టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన 65 అభ్యర్థులు, బీజేపీ తరపున పోటీ చేసిన 44, బీఎస్పీ తరపున పోటీ చేసిన 27 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 


టీఆర్ఎస్ 50-65 
ప్రజాకూటమి )38 -52
బీజేపీ 4-7
ఇతరులు 10- 17


సంబంధిత వార్తలు

టైమ్స్ నౌ సిఎన్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్: కేసీఆర్ దే హవా