హైదరాబాద్: తెలంగాణలో ఉత్కంఠంగా జరిగిన పోలింగ్ ముగిసింది. దీంతో తెలంగాణ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆరా న్యూస్ సర్వే ఎక్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఆ ఫలితాలు చూద్దాం.

టీఆర్ఎస్..............................................75-85

ప్రజాకూటమి......................................... 25-35

బీజేపీ..................................................... 2-3

ఎంఐఎం.................................................7-8
 
ఇతరులు............................................. 0

ఆరా న్యూస్ సర్వే ప్రకటించిన ఎగ్జిట్ పోల్ లోనూ టీఆర్ఎస్ పార్టీ విజయం ఎగురవేస్తున్నట్లు ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ స్వతంత్రంగా 75 నుంచి 85 స్థానాలు, మిత్రపక్షం ఎంఐఎం ఏడు నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది. అటు బీజేపీ 2 నుంచి 3 స్తానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో స్పష్టం చేసింది. మెుత్తం ఆరా న్యూస్ సర్వేతో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కుంచుకుంటున్నట్లు  తెలుస్తోంది. 

మరోవైపు ప్రజాకూటమి 38 స్థానాల నుంచి 52 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ప్రకటించింది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ ఒక్క స్తానాన్ని కూడా గెలవలేదని తెలిపింది. అలాగే ఇతరులు సైతం బోణీ కొట్టలేరని సర్వేలో ప్రకటించింది. మెుత్తానికి ఈ సర్వేతో టీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహం నెలకొందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. శాసనసభలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు, ప్రజా కూటమికి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కాంగ్రెసు నేతృత్వంలో తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి (టీజెఎస్)లతో కలిపి ప్రజా కూటమి ఏర్పడింది.

బిజెపి ఒంటరిగా పోటీ చేసింది. రాష్ట్రంలోని 109 స్థానాలకు ఆ పార్టీ పోటీ చేసింది. కాగా, సిపిఎం నేతృత్వంలో బిఎల్ఎఫ్ కూడా పోటీ చేసింది. మజ్లీస్ హైదరాబాదులో ముఖ్యంగా పోటీ లో ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఇండియా టూడే తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: దూసుకుపోయిన కారు

రిపబ్లిక్ టీవీ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరా హోరీ

రిపబ్లికన్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: కేసీఆర్ దే హవా

సీఎన్ఎన్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటా పోటీ

టైమ్స్ నౌ సిఎన్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్: కేసీఆర్ దే హవా