Asianet News TeluguAsianet News Telugu

ప్రజల దగ్గర లాక్కోవడమే కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ.. : మంత్రి జగదీష్ రెడ్డి

Suryapet: ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అలాగే, బంజారాల సంక్షేమానికి కేసిఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్న‌ద‌నీ, గిరిజనుల సమస్యల  పరిష్కారాలకు వ్యూహ కేంద్రంగా బంజారాభవన్ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. గిరిజనుల  స్వయం పాలనకోసమే నూతన పంచాయితీలు ఏర్పాటు చేశామ‌నీ, బంజారాల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.

Telangana Energy Minister G Jagadish Reddy Slams Congress RMA
Author
First Published Oct 7, 2023, 1:06 AM IST

Telangana Energy Minister G Jagadish Reddy: దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో బంజారాల సంక్షేమానికి ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని చెప్పారు. బంజారాల సంక్షేమానికి కేసిఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్న‌ద‌నీ, గిరిజనుల సమస్యల  పరిష్కారాలకు వ్యూహ కేంద్రంగా బంజారాభవన్ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. గిరిజనుల  స్వయం పాలనకోసమే నూతన పంచాయితీలు ఏర్పాటు చేశామ‌నీ, బంజారాల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ప్రజల దగ్గర లాక్కోవడమే కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ అని వ్యాఖ్యానించారు.

సూర్యాపేట లోని నూతన కలెక్టరెట్ సమీపం లో  ఎకరం విస్తీర్ణంలో రెండు కోట్ల వ్యయం తో  నిర్మించనున్న బంజారా భవనానికి మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 700 తండాలు మాత్రమే గ్రామ పంచాయతీలుగా ఉండేవని, గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీ హోదా కల్పించడంతో రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా 2400 తండాలు జీ.పీలుగాఅవతరించాయని వివరించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే గిరిజనుల కోసం తెలంగాణాలో అమలవుతున్న కార్యక్రమాలు అనేకం ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో తన సొంత నియోజకవర్గంలో ప్రతి తండాకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయించగలిగాననీ, ప్రస్తుతం వాటిని బీటీ రోడ్లుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. భవిష్యత్తులోనూ తండాల అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి నిరంతరం కృషి కొనసాగిస్తామన్నారు. గిరిజనుల సమస్యల  పరిష్కారాలకు వ్యూహ కేంద్రంగా బంజారాభవన్ ల పని తీరు వుండేలా  మూడు అంతస్తుల లో నిర్మాణంచేయనున్నట్లు మంత్రి తెలిపారు. భ‌వ‌న్ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరి పాలన లో ఏమి లబ్ధి చేకూరిందో  గిరిజన సోదరులు ఆలోచించాలనీ,  ఒకనాడు బీడు భూములు గా ఉన్న తండాలు, గ్రామాలకు గోదావరి జలాలను తీసుకువచ్చి పచ్చగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ నే అన్నారు.

మన రాష్ట్రం లోఅమలవుతున్న ఏ ఒక్క పధకం కూడా  మిగతా రాష్ట్రాలలో లేవని మంత్రి అన్నారు. ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి.. పొరపాటున కాంగ్రెస్ జెండా పడితే, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు వద్దనిచెప్పినట్లే అన్నారు. ప్రజల వద్ద నుండి లాక్కోవడమే కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ విమ‌ర్శించారు. మన జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ కు బీఆర్ ఎస్ పార్టీ కి అండగా నిలబడాలని మంత్రి ప్ర‌జ‌ల‌ను కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios