Telangana Election Result 2023: భద్రచలంలో బీఆర్ఎస్ విజయం, భార మెజారిటీతో గెలిచిన తెల్లం వెంకట రావ్
భద్రాచలంలో పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది... మొదట ఏడెనిమిది రౌండ్ల వరకూ లీడ్ లో ఉన్న కాంగ్రెస్.. సడెన్ గా వెనుకపడింది.. మెజారిటీల కూడా మార్పు వచ్చి... బీఆర్ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు గెలుపొందారు.

తెలంగాణాలో కాంగ్రెస్ గాలి గట్టిగా వీస్తోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాలను కౌవసం చేసుకుంటుంది కాంగ్రెస్ .అయితే కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న చోట్ల అనూహ్యంగా బీఆర్ ఎస్ గెలిచిన ప్లేస్ లు కూడా ఉన్నాయి. అందులో కాంగ్రెస్ కు కాస్త షాక్ ఇచ్చారు భద్రాచలం నియోజకవర్గం ప్రజలు. అక్కడ 8 రౌండ్లకు పైగా.. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నారంత. కాని అనూహ్యంగా ఓట్లు బీఆర్ఎస్ కు భారీగా పెరుగుతూ వచ్చాయి. దాదాపు 4 వేల వందల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకటరావు గెలుపోందారు.
కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పోండెం వీరయ్య గెలుపోందుతారు అనుకుంటే.. ఆయన ఓడిపోయారు.లాస్ట్ టైమ్ పోందెం వీరయ్య భద్రాచలంలో తెల్లంపై గెలుపొందగా.. ఈసారిమాత్రం ఓడిపోరారు. భద్రాచంలో పోందెంపై ఉన్న వ్యతిరేకత ఆయన ఓడిపోవడానికి కారణం అని తెలుస్తోంది.