Asianet News TeluguAsianet News Telugu

telangana elections 2023 : తెలంగాణలో పవన్ కల్యాణ్ టోన్ ఎందుకు మారింది?

పవన్ కల్యాణ్ పంథా మార్చుతున్నారా? ఆవేశం తగ్గించుకుని, ఆలోచించి, ఆచీ తూచీ అడుగు వేస్తున్నారా? తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తన ప్రచారోపన్యాసాల్లో అనుకున్నంత వేడి లేదా? కేసీఆర్ గురించి ఒక్కమాటా మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? 

Telangana elections 2023 : Pawan Kalyan tone changed? - bsb
Author
First Published Nov 23, 2023, 12:00 PM IST

హైదరాబాద్ : జనసేన పార్టీ ఆవిర్బవించిన తరువాత తెలంగాణలో ఇన్నేళ్లుగా పోటీకి దిగలేదు జనసేన. కానీ ఈ సారి ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. పొత్తులో ఉంది కాబట్టి పార్టీ తరఫున ప్రచారం కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ మీద వీరావేశంతో ఊగిపోతూ.. పూనకాలు లోడింగ్ అన్న స్థాయిలో విరుచుకుపడతారు పవన్. గతంలోనూ తెలంగాణలో ఆయనది ఇదే ధోరణి. ఇదే వరంగల్ గడ్డ మీద గతంలో కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ సమయంలో అదో పెద్ద సంచలనంగా మారింది. అమరవీరులనూ అవమానించారు. 

తెలంగాణ విభజన వల్ల ఆంధ్రకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆయన టోన్ మారింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి తనకో సమస్య ఉందని అంటున్నారు. నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలు సకల జనుల సమ్మె చేసి,12వందల మంది ప్రాణాలు త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ. పదేళ్ల పాటు దాని అభివృద్ధి చూడాలనుకున్నాను. అవినీతి రహిత తెలంగాణ ఏర్పడుతుందనుకున్నాను. నాలుగు కోట్ల తెలంగాణ పౌరుల గౌరవసూచకంగా నేను ఇంత కాలం గళం విప్పలేదు. ప్రభుత్వాన్ని విమర్శించలేదు అని సమర్థించుకున్నారు. 

మరోవైపు.. తెలంగాణలో అవినీతి గురించి మాట్లాడుతూ...‘ఆంధ్రపరదేశ్ లో అవినీతి జరిగితే అర్థం చేసుకునేవాడిని.. అవినీతి అలవాటైపోయింది అక్కడ.. కానీ తెలంగాణ బలి దానాల మీద వచ్చిన రాష్ట్రం ఇంత అవినీతి పాలవుతుందని నేను ఊహించలేదు. తెలంగాణలో అధికారం చూడట్లే మార్పు చూస్తున్నాను’ అంటూ సుతి మెత్తగా మాట్లాడారు. 

దీంతో పవన్ కల్యాన్ ప్రసంగాన్ని విన్నవారంతా ఇదేందిదీ.. ఇంత మార్పేందయ్యా.. నీ తిక్క ఎక్కడికి పోయింది.. అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి కారణం బీజేపీ తన భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ కి గురి పెడుతోందని పవన్ గ్రహించాడా? అని విమర్శకులు అంచనా వేస్తున్నారు. నిన్న హనుమకొండలో జరిగిన బీజేపీ సభలో కేసీఆర్ ను, టీఆర్ఎస్ నాయకులను పల్లెత్తు మాట అనకుండానే ప్రసంగం ముగించాడు. 

Pawan Kalyan : టార్గెట్ కూకట్ పల్లి...జనసేన గెలుపుకోసం స్వయంగా రంగంలోకి పవన్ కల్యాణ్

పైగా ఆంధ్రలో తానెలా పోరాడుతున్నానో చెప్పుకొచ్చాడు. ఆంధ్ర జన్మనిస్తే... తెలంగా పునర్జన్మనిచ్చింది. అందర్లాగా మాటలు చెప్పలేను. మీకే సమస్య ఉన్నా నేనొస్తాను. ఆంధ్రాను ఎలా గుండెల్లో పెట్టి చూసుకుంటానో.. తెలంగాణను అలాగే చూసుకుంటాను. ఇది జనసేన ఆవిర్భవించిన తెలంగాణ.. అంటూ ఏవేవో మాట్లాడాడు. 

వారాహి యాత్రచేస్తూ ఏపీలో అక్కడి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఇక్కడ అంతకంటే ఎక్కువ ముఖ్యమైన పరిస్థితి. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. అయినా ఆవేశం లేదు, ఆసక్తి లేదు.. ఊగిపోవడాలు లేవు. ఎందుకిలా? అంటే తెలంగాణలోని హైదరాబాద్ లోనే సినీ పరిశ్రమ ఉంది. అంతకు మించి బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో ఉందన్న విషయం అర్థమై ఉంటుంది అని విశ్లేషకుల అంచనా.

ఈ రెండు పార్టీల మధ్య పైకి కనిపించని బలమైన బంధం ఉందని కూడా పవన్ కు తెలుసని, వేరే ఏవో విశాల ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వారి స్నేహానికి, అనుబంధానికి మధ్య తల దూర్చి.. బొప్పి కట్టించుకోవడం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నాడని అంచనా. నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్లిపోతే ఖేల్ ఖతం దుక్నం బంద్ కదా... అయితే ఇక్కడే మరో ప్రశ్న ఉదయిస్తుంది. రేపు ఏపీలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే.. ఇప్పటికే అధికార పార్టీకి బీజేపీ మద్దతు అనే ఊహాగానాలున్న నేపథ్యంలో పవన్ ఏం చేస్తాడు? అని కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios