Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ: మున్సిపల్ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..?

తెలంగాణలో ఇవాళ్టీ నుంచి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై మరికొద్దిసేపట్లో నిర్ణయం తీసుకోనుంది ఎస్ఈసీ.

telangana election commission focus on municipal election campaign due to night curfew ksp
Author
Hyderabad, First Published Apr 20, 2021, 3:18 PM IST

తెలంగాణలో ఇవాళ్టీ నుంచి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై మరికొద్దిసేపట్లో నిర్ణయం తీసుకోనుంది ఎస్ఈసీ.

నైట్ కర్ఫ్యూ కారణంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లలో ఎన్నికల ప్రచారంపై సందిగ్థత ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించే అవకాశం కూడా కనిపిస్తోంది. కాసేపట్లో దీనిపై ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు వున్నాయి. 

కాగా, తెలంగాణ రాష్ట్రంలో  రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

Also Read:కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీటికి మినహాయింపు

మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఐటీ, ఈ కామర్స్ వస్తువుల పంపిణీ, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లకు కూడా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా విభాగాలు, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌజేస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ లకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభించింది.

గర్భిణీలు, రోగులు మెడికల్ సేవలు పొందవచ్చు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల నుండి ఇళ్లకు వెళ్లేవారంతా టికెట్లను చూపాలని ప్రభుత్వం ప్రకటించింది.నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మెడికల్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తమ వెంట గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios