కామరెడ్డి డీఎస్పీ లక్ష్మీ నారాయణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 

బెట్టింగ్‌ కేసులో నిందితుల నుంచి కామారెడ్డి సీఐ జగదీశ్‌, ఎస్సై గోవింద్‌ డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో డీఎస్పీని కూడా విచారించారు. అయితే బెట్టింగ్‌ కేసులో లక్ష్మీ నారాయణ ప్రమేయం లేదని తేలినప్పటికీ, ఆయన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ విచారణ చేపట్టింది.  దీంతో ఆయనను ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిచించారు.

కామారెడ్డి సీఐ జగదీష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో జగదీష్ రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. సీఐ ఇంటితో పాటు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ జగదీష్‌తో పాటు సహకరించిన సృజయ్ కూడా అరెస్ట్ అయ్యాడు.

నిజామాబాద్‌ పరిధిలో వెలుగుచూసిన ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డ కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ కేసులో ఆరా తీస్తుంటేనే అక్రమాస్తుల వ్యవహారం బైటికి వచ్చింది. బెట్టింగ్ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే.. కామారెడ్డి డి.ఎస్.పి లక్ష్మీనారాయణ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తేలింది. 

దీంతో డీఎస్పీ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేసి.. పోలీసు అతిథి గృహంలో డీఎస్పీ లక్ష్మీనారాయణను విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో లక్ష్మీనారాయణకు సంబంధం లేదని తేలినప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఆదివారం అరెస్ట్ చేశారు.