Asianet News TeluguAsianet News Telugu

తెలుగు మీడియం అభ్యర్థులకు దిమ్మ తిరిగే షాక్

  • ఏడు జిల్లాల్లో తెలుగు మీడియం ఎస్జీటి పోస్టులు సున్నా
  • లబోదిబోమంటున్న నిరుద్యోగ అభ్యర్థులు
telangana dsc notification gives shocks to teacher aspirants

గతం నుంచి కూడా ఒక సాంప్రదాయం ఉండేది డిఎస్సీ ఎప్పుడు పడినా ఎస్జీటి పోస్టులు దండిగా ఉండేవి... స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొద్దిగన్ని ఉండేవి. కొంత కాలం కిందట అయితే రెండు కేటగిరీ పోస్టులకు కూడా బిఇడి వాళ్లు రాసుకునేందుకు అనుమతి ఉండేది. దీంతో ఎస్జీటి పోస్టులు చాలా ఉంటాయి కాబట్టి బిఇడి వాళ్లంతా ఎస్జీటి పోస్టులకు ఎగబడేవారు. కానీ తర్వాత కాలంలో ఎస్జీటి పోస్టులకు డిఇడి (టిటిసి) వారినే అర్హులుగా ప్రకటించారు. దీంతో బిఇడి చేసిన వారంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది.

అయినప్పటికీ ఎస్జీటి పోస్టుల సంఖ్య స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండేది. తెలుగు మీడియం అభ్యర్థులకు తెలంగాణ సర్కారు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలుగు మీడియం చదువుకొని డిఎస్సీ ఎజ్టీటి పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పోస్టుల కొరత వేధిస్తున్నది. ఏడు జిల్లాల్లో తెలుగు మీడియం ఎస్జీటి పోస్టుల సంఖ్య సున్నా మాత్రమే. మరో 8 జిల్లాల్లో అత్తెసరు పోస్టులే ఉన్నాయి.

జిల్లాల వారీగా ఎస్జీటి తెలుగు మీడియంలో సున్నా పోస్టులు ఉన్న జాబితా కింద చూడండి. కొత్త జిల్లాల DSC తో SGT లో తీవ్రంగా నష్టపోతున్న 15 జిల్లాల అభ్యర్థులు..

1 వరంగల్ అర్బన్ : 0

2 వరంగల్ రూరల్ : 0

3 జనగాం : 0

4 ఖమ్మం : 0

5 నల్లగొండ : 0

6 సూర్యాపేట : 0

7 యాదాద్రి : 0

8 పెద్దపల్లి =   1

9 రాజన్న   = 1

10 సిద్ధిపేట = 3

11 జగిత్యాల  = 5

1 2 మహబూబాబాద్ = 8

13 కరీంనగర్ = 11

14. ఆదిలాబాద్  = 17

15.నిజామాబాద్ = 19

ఇంతకాలం డిఇడి చేసి టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ జిల్లాల స్థానికత ఉన్నవారు బయటి జిల్లాల్లో పరీక్ష రాయాలంటే నాన్ లోకల్ కిందకు వస్తారు కాబట్టి ఇక ఈ డిఎస్సీతో తమకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని తెలుగు మీడియం నిరుద్యోగ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios