Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఆదేశాలు... రంగంలోకి డీఎంఈ రమేశ్ రెడ్డి, జూడాలతో చర్చలు

జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. డీఎంఈ రమేశ్ రెడ్డి వారితో చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

telangana dme dr ramesh reddy meets junior doctors ksp
Author
Hyderabad, First Published May 26, 2021, 7:10 PM IST

జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. డీఎంఈ రమేశ్ రెడ్డి వారితో చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జూడాలు విధులు బహిష్కరించడంపై ఆయన స్పందించారు.జూనియర్ డాక్టర్ల సమ్మెపై సీఎం కేసీఆర్ బుధవారం నాడు ఉన్నతాధికారులతో చర్చించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు న్యాయమైతే  ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే  వాటిని పరిష్కరిస్తామన్నారు. కానీ ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం సరైంది కాదన్నారు.

నిమ్స్ లో వైద్యుల కుటుంబసభ్యులకు చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని  ఆయన అధికారులను ఆదేశించారు. జూడాలు వెంటనే విధుల్లో చేరాలని ఆయన కోరారు. సమ్మె పేరుతో విధులు బహిష్కరించడం సరైంది కాదన్నారు.  సీనియర్ ప్రెసిడెంట్ల గౌరవ వేతనం 15 శాతం పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్ లో వైద్యం అందిస్తున్నట్టుగా సీఎం తెలిపారు.

Also Read:సమ్మెను విరమించకపోతే చర్యలు తప్పవు: జూడాలకు కేటీఆర్ హెచ్చరిక

ఈ సమయంలో  సమ్మె చేయడాన్ని ప్రజలు కూడ హర్షించరని సీఎం అభిప్రాయపడ్డారు. జూడాలను ప్రభుత్వం ఏనాడూ కూడ చిన్నచూపు చూడలేదన్నారు. ఇవాళ, రేపు అత్యవసర విధుల్లో జూనియర్ డాక్టర్లు పాల్గొంటారు. అప్పటికి ప్రభుత్వం  తమ డిమాండ్లను పరిష్కరించకపోతే  ఏ రకమైన విధుల్లో కూడ పాల్గొనబోమని జూడాలు తేల్చి చెప్పారు.  ఇదిలా ఉంటేజూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం సరి కాదని మంత్రి కేటీఆర్ ఇప్పటికే అన్నారు జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరాలని ఆయన కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios