Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో చొరబడేందుకు మావోల యత్నం.. అది జరగదు: డీజీపీ మహేందర్ రెడ్డి

మావోయిస్టుల ఆగడాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించేది  లేదన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

telangana dgp mahender reddy review meeting in police officials
Author
Eturnagaram, First Published Jul 18, 2020, 10:23 PM IST

మావోయిస్టుల ఆగడాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించేది  లేదన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. శనివారం  ఏటూరు నాగారం సబ్ డివిజన్ లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ఆయన ములుగు, భూపాలపల్లికి చెందిన పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారని డీజీపీ మండిపడ్డారు.

మావోయిస్టులకు ఎవరూ సహకరించకూడదని ఆయన విజ్ఙప్తి చేశారు. డాక్టర్లు ,ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి మావోలు డబ్బులు వసూలు చేసేందుకే తెలంగాణలో తిరిగి అడుగుపెట్టాలని చూస్తున్నారని మహేందర్ రెడ్డి అన్నారు.

పదేళ్ల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ఇక్కడి నుంచి పారిపోయిన మావోయిస్టులు తిరిగి ఇక్కడి ప్రజల కోపాగ్నికి గురి కావొద్దని ఆయన హెచ్చరించారు. ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్య , వైద్యం వంటి సదుపాయాలను పొందుతూ ప్రజలు సంతోషంగా ఉన్నారని డీజీపీ చెప్పారు.

ఇలాంటి సమయంలో రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు రానున్న కాలంలో తెలంగాణ పోలీస్ శాఖ గట్టి సమాధానం చెబుతుందని మహేందర్ రెడ్డి చెప్పారు.

నక్సలిజం లేకపోవడంతో తెలంగాణ దేశంలో అభివృద్దిలో శరవేగంగా దూసుకుపోతోందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో పలువురు అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

"

Follow Us:
Download App:
  • android
  • ios