సెలబ్రెటీల కికీ ఛాలెంజ్... ఫైర్ అయిన తెలంగాణ డీజీపీ

First Published 2, Aug 2018, 3:45 PM IST
telangana DGP mahender reddy fire on youth over kiki challenge
Highlights

ఎవరైనా కికీ డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ఛాలెంజ్ చేసిన వారితో పాటు.. డ్యాన్స్ చేసిన వారిని కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

హీరోయిన్స్ అదాశర్మ, రెజీనా కసాండ్రాలు ఇటీవల కికీ ఛాలెంజ్ స్వీకరించి.. డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. వారి డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. కాగా.. వారిని ఆదర్శంగా తీసుకొని  చాలా మంది యవత దీనిని ఫాలో అవుతున్నారు. దీంతో.. వారికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి  సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణ యూత్ ఇలాంటి ఛాలెంజ్‌లు తీసుకోవద్దని చెప్పారు. ఎవరైనా కికీ డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ఛాలెంజ్ చేసిన వారితో పాటు.. డ్యాన్స్ చేసిన వారిని కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాపై ఇప్పటికే నిఘా పెట్టామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిషనర్లను, ఎస్పీలను అప్రమత్తం చేశామని డీజీపీ తెలిపారు.
 
ఇటీవల ‘కికీ’ ఛాలెంజ్‌ పేరుతో నడుస్తున్న కార్లో నుంచి దూకి నడిరోడ్డుపై డ్యాన్స్‌ చేయడం నగరంలో యువతకు ఫ్యాషన్‌గా మారింది. అలా చేయడం వల్ల వారికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ఇది ప్రాణాంతకంగా మారుతోంది.

loader