Congress: ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను నిరాకరించిన డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ సీఎం భట్టి విక్రమార్క.. ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని నిరాకరించారు. నిరుద్యోగులకు రూ. 4000 భృతి ఇస్తామని ఎవరూ, ఎప్పుడూ హామీ ఇవ్వలేదని అసెంబ్లీలో భట్టి పేర్కొన్నారు.
 

telangana deputy cm bhatti vikramarka refutes priyanka gandhis pre poll promise of unemployment allowance kms

అధిష్టానానికి పార్టీ నాయకులు కట్టుబడి ఉంటారు. హైకమాండ్ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఏదైనా అసంతృప్తి ఉంటే అగ్రనేతలకు చెప్పుకునే, నిర్ణయాలను సవరించుకునే అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. కానీ, అగ్రనేతల వ్యాఖ్యలనే నిరాకరించే పరిస్థితులు అరుదు. తాజాగా ఇలాంటి పరిణామం జరిగింది. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ నిరాకరించారు.

నిరుద్యోగులకు రూ. 4000 భృతి చెల్లిస్తామని ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించారు. కానీ, ఈ ప్రకటన చేయలేదని భట్టి విక్రమార్క్ కొట్టిపారేశారు. అసెంబ్లీలో ఈ మాట అన్నారు. ఆరు గ్యారంటీల్లోగానీ, ఎన్నికల క్యాంపెయిన్‌లోగానీ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక గాంధీ ఈ హామీ ఇస్తున్న వీడియో, ఆ హామీని కొట్టిపారేస్తున్న భట్టి విక్రమార్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: 2024 Elections: ప్రధాని మోడీపై వారణాసి నుంచి విపక్ష కూటమి నుంచి పోటీ చేసేది ఎవరు?

హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ ఈ హామీ ఇచ్చారు. మే నెలలో సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ  ప్రియాంక ఈ హామీ ఇచ్చారు.  నిరుద్యోగ యువతకు రూ. 4000 భృతి అందిస్తామని ప్రకటించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios