Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలో 16 వేల పోస్టుల భర్తీకి అనుమతులు : సీఎస్

తెలంగాణలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో అనుమతులు ఇస్తామన్నారు సీఎం సోమేశ్ కుమార్. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 

telangana cs somesh kumar review meeting on recruitment
Author
First Published Nov 29, 2022, 9:34 PM IST

రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్. త్వరలో మరో 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తామని ఆయన తెలిపారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితో కలిసి మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు పలు శాఖల్లోని 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చామన్నారు. త్వరలో మరో 16,940 పోస్టులకు కూడా అనుమతి ఇస్తామని సోమేశ్ కుమార్ వెల్లడించారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే ఇందుకు అవసరమైన సమాచారాన్ని కమీషన్‌తో కలిసి పంచుకోవాలని సోమేశ్ కుమార్ సూచించారు. 

ఇకపోతే.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 9,168 గ్రూప్-IV ఖాళీలను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం త్వరలో శాఖల వారీగా కమిషన్ ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని శాఖల వారీగా జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న పోస్టుల పూర్తి వివరాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

‘‘వాగ్దానాలు, ఆశయాలను నెరవేర్చే నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. అభ్యర్థులకు శుభాకాంక్షలు' అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

ALso Read:నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. గ్రూప్- 2,3, 4 లలో మరికొన్ని పోస్టులు చేర్చుతూ ఉత్తర్వులు..

గత శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఫైనాన్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో 1,862 వార్డు ఆఫీసర్లు, ఫైనాన్స్ విభాగాల్లో 18 జూనియర్ ఆడిటర్ల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. అదేవిధంగా వివిధ విభాగాల్లో మొత్తం 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్‌లో 44, పశుసంవర్ధక అండ్ మత్స్యశాఖలో రెండు, బీసీ సంక్షేమంలో 307, సివిల్ సప్లయిస్ లో  72, ఎనర్జీలో 2, పర్యావరణం అండ్ అడవులలో 23, ఫైనాన్స్‌లో 46, జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో ఐదు, 338 ఆరోగ్యం అండ్ వైద్యంలో ఉన్నాయి. 

ఉన్నత విద్యలో 742, హోమ్ లో  133, పరిశ్రమలు అండ్ వాణిజ్యంలో ఏడు, నీటిపారుదలలో 51, కార్మిక అండ్ ఉపాధిలో 128, మైనారిటీ సంక్షేమంలో 191, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 601, పంచాయతీ రాజ్‌లో 1,245, ప్లానింగ్‌లో 2, రెవెన్యూలో 2,0477, ఎస్సీ డెవలప్‌మెంట్‌లో 97, సెకండరీ ఎడ్యుకేషన్‌లో 97, ట్రాన్స్పోర్ట్ లో 2, గిరిజన సంక్షేమంలో 221, స్త్రీ అండ్ శిశు అభివృద్ధి శాఖలలో 18 ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios