Asianet News TeluguAsianet News Telugu

ఏం చేద్దాం... ఎలా చేద్దాం: ఎన్ఆర్ఐల తరలింపుపై తెలంగాణ సర్కార్‌ కసరత్తు

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు తరలింపుకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

telangana cs somesh kumar review meeting on Evacuation Of Indians Stranded
Author
Hyderabad, First Published May 6, 2020, 7:07 PM IST

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు తరలింపుకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ విదేశాలలో నిలిచిపోయిన భారతీయ పౌరుల తరలింపుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిందని సీఎస్ అన్నారు.

Also Read:విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి.. ఛార్జీ ఎంతో తెలుసా

ఆరు దేశాల నుంచి 7 ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 2,350 మంది ప్రయాణీకులు రాష్ట్రానికి రానున్నారని, వీరికి అవసరమైన క్వారంటైన్, ఎయిర్‌పోర్టులో మెడికల్ స్క్రీనింగ్, కేంద్ర నోడల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు తమ స్వంత ఖర్చుతో వెళ్లవలసి వుంటుందని చెప్పారు. ప్రయాణీకుల 14 రోజుల వసతికి సంబంధించి హోటళ్లతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించాలని సీఎస్ సూచించారు.

క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్ చెకప్‌లను రెగ్యులర్‌గా నిర్వహించడానికి ప్రత్యేక మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని సోమేశ్ కుమార్ చెప్పారు. ఎయిర్‌పోర్ట్ నుంచి క్వారంటైన్ సెంటర్లకు ప్రయాణీకులను తరలించే బాధ్యతను ఆర్టీసీ ఎండీకి అప్పగించారు.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 64 విమానాల్లో విదేశాల్లో ఉన్న 14,800 మంది ఇండియాకు

ఈ సమావేశంలో  వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, వికాస్ రాజ్ , పోలీస్ శాఖ అదనపు డి.జి. (L&O) జితేందర్ , కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా,  జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్ , సైబారాబాద్ పోలీస్ కమీషనర్  సజ్జనార్, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్ , ప్రోటో కాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ , ఎయిర్ పోర్ట్  ఇమ్మిగ్రేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios