Asianet News TeluguAsianet News Telugu

Telangana Corona Cases: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కోవిడ్ పాజిటివ్

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. 

Telangana Corona Update...  TRS MLA Danam Nagender Tests covid Positive
Author
Hyderabad, First Published Jan 24, 2022, 3:06 PM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా (corona) కలకలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ (corona second wave) తర్వాత చాలారోజులు కేవలం వందల్లోనే నమోదయిన కేసులు తాజాగా థర్డ్ వేవ్ (corona third wave) మొదలైన తర్వాత వేలల్లో నమోదవుతున్నాయి. సామాన్యులు మొదలు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల్లో ఎక్కువగా వుండే ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇలా ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులకు ఈ వైరస్ సోకగా తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (danam nagender) కు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.   

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా లక్షణాలతో బాధపడుతూ టెస్ట్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే పాజిటివ్ గా నిర్దారణ కాగా డాక్టర్ల సూచన మేరకు హోంక్వారంటైన్ లోకి వెళుతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో వున్నానని... అనుచరులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించారు. 

తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది కాబట్టి ఇటీవల తనను కలిసిన వారు కూడా టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే దానం సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వుండాలని ఎమ్మెల్యే ట్విట్టర్ ద్వారా సూచించారు.

ఇదిలావుంటే ఇప్పటికే దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) కూడా కరోనా(Coronavirus) బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకోగా కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోనే ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

ఇక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు. ఆరోగ్యం బాగాలేక‌పోతే డాక్ట‌ర్లు కోవిడ్ టెస్ట్ చేశార‌ని చెప్పారు. దీంతో క‌రోనా పాజిటివ్ గా తేలింద‌ని అన్నారు. అయితే స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు. అయితే తాను కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ, అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని హోం ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల త‌నతో కాంటాక్ట్ అయిన వారంద‌రూ కరోనా ప‌రీక్షలు నిర్వ‌హించుకోవాల‌ని అన్నారు. అంద‌రూ ఆరోగ్యంగా ఉండాల‌ని ఆకాంక్షించారు. 

కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డికి కూడా కరోనా సోకింది. దీంతో హోం ఐసోలేషన్ లో ఉన్నట్టుగా మంత్రి ప్రకటించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి (gandra venkataramana reddy) కరోనా బారినపడ్డారు. వెంకటరమణా రెడ్డితో పాటుగా ఆయన సతీమణి, వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి‌కి (gandra jyothi) కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.  

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (pocharam srinivas reddy) కూడా కరోనా సోకింది. ఆయన ఇదివరకే ఓసారి కరోనా బారిన పడగా తాజాగా రెండోసారి కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి ఆయనకు కరోనా సోకింది. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో స్పీకర్ పోచారం టెస్ట్ చేయించుకున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోయినా డాక్టర్ల సూచన మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు.  

టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు కేశవరావు (keshav rao) కూడా కరోనా బారినపడ్డారు. కాస్త అనారోగ్యంగా వుండటంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ (corona positive) గా నిర్దారణ అయ్యింది. అయితే కేశవరావుకు కరోనా వల్ల ఎలాంటి సమస్య లేకపోవడంతో హోంఐసోలేషన్ (home isolation) లో వుండాలని డాక్టర్లు సూచించారు. దీంతో తన నివాసంలోనే వుంటూ కరోనా చికిత్స పొందుతున్నారు ఎంపీ కేశవరావు.  

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (errabelli dayakar rao) కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల న్యూడిల్లీ నుండి తిరిగివచ్చిన మంత్రి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (ranjith reddy)కి కూడా కరోనా సోకింది

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.  మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కు కూడా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios