Asianet News TeluguAsianet News Telugu

Telangana Corona Cases: కరీంనగర్ లో కరోనా కలకలం... ఇద్దరు ప్రభుత్వ టీచర్లకు పాజిటివ్

తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం మొదలయ్యింది. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు స్కూల్ టీచర్లు కరోనాబారిన పడటం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలయ్యింది. 

Telangana Corona Cases: two government teachers tested corona positive in karimnagar district
Author
Karimnagar, First Published Nov 10, 2021, 11:51 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం మొదలయ్యింది. కరోనా కారణంగా గత రెండెళ్లుగా మూతపడ్డ పాఠశాలలు ఇటీవలే పున:ప్రారంభమైన విషయం తెలిసింది. అయితే తాజాగా మళ్లీ స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను కరోనా మహమ్మారి భయపెడుతోంది. ప్రభుత్వ పాఠశాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. 

karimnagar district తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కరోనా కలకలం రేగింది. ఈ పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులకు corona positive గా నిర్దారణ అయ్యింది. దీంతో తోటి సిబ్బందితో సహా స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. 

read more  ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..

ఇదిలావుంటే తెలంగాణలో గత 24గంటల్లో(08.11.2021 సోమవారం సాయంత్రం 5గంటల నుండి 09.11.2021 మంగళవారం సాయంత్ర 5గంటల వరకు) 40,797 కరోనా పరీక్షలు నిర్వహించగా 173 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 61 corona positive cases నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల,  కామారెడ్డి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ , వనపర్తి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 

ఇదే సమయంలో 168మంది కరోనా నుంచి కోలుకోగా (corona deaths in telangana) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,72,823కి చేరుకుంది. 6,65,101 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో 3,754 యాక్టీవ్ కేసులు వున్నాయి. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,968కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 3, జీహెచ్ఎంసీ 61, జగిత్యాల 2, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 12, ఖమ్మం 6, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 4, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 13, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 8, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 3, పెద్దపల్లి 6, సిరిసిల్ల 0, రంగారెడ్డి 12, సిద్దిపేట 1, సంగారెడ్డి 9, సూర్యాపేట 2, వికారాబాద్ 0, వనపర్తి 0, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 9, యాదాద్రి భువనగిరిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి.

read more  భద్రాచలం: ప్రభుత్వం దవాఖానాలో కలెక్టర్ భార్య ప్రసవం... ఆదర్శంగా నిలిచిన ఆల్ ఇండియా టాపర్

తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. అయితేే మొదటి వేవ్ తర్వాత కూడా ఇలాగే భారీగా కేసులు తగ్గగా ఇక కరోనా భయం తొలగినట్లేనని అందరూ భావించారు. కానీ సెకండ్ వేవ్ మొదలై కరోనా వైరస్ మరింత భయంకరంగా విజృంభించి చాలామంది ప్రాణాలను బలితీసుకుంది. అందువల్లే తాజాగా కరోనా కేసులు తగ్గినా ప్రజలు జాగ్రత్తగా వుండాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. మాస్కులు, శానిటైజర్లను వాడుతూ సామాజిక దూరం పాటించాలని...వీటిని జీవితంలో ఒకభాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios