ఓటర్లకు ప్రలోభాలు:హుజూరాబాద్ ఉపఎన్నిక రద్దుకై ఈసీకి కాంగ్రెస్ వినతి

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరంది. ఆ పార్టీ నేతలు శ్రవణ్ కుమార్, వంశీచంద్ రెడ్డి తదితరులు గురువారం నాడు సీఈసీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Telangana Congress  requests CEC To Cancel Huzurabad bypoll

న్యూఢిల్లీ: Huzurabad bypoll ఉప ఎన్నికను రద్దు చేయాలని Congress  పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ Sushil Chandraను కలిసి వినతిపత్రం సమర్పించారు.CEC ను కలిసిన వారిలో ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి  Dasoju Sravan, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితరులున్నారు.

also read:Huzurabad bypoll: ఉప ఎన్నికను నిలిపివేయాలని సీఈసీని కోరనున్న కాంగ్రెస్

హుజురాబాద్ ఉప ఎన్నికల్లోTrs, Bjp లు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఓటర్లను కొనుగోలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.ఓటుకు 6 వేల రూపాయల నుంచి 10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఈసీ దృష్టికి తీసుకొచ్చింది. ఈ మేరకు వీడియో క్లిప్పింగ్‌లను  కాంగ్రెస్ పార్టీ సీఈసీకి అందించారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  బహుమతులు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీఈసీ దృష్టికి తీసుకొచ్చింది. మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు.ఇంత ఘోరంగా విచ్చలవిడిగా అడ్డగోలు అక్రమాలు, ఎన్నికల నిబంధనల అతిక్రమణలు ఎక్కడా జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు.

ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికకు రెండు రోజుల ముందు Congress పార్టీ సీఈసీని కలిసి ఈ  డిమాండ్ చేయడం  కలకలం రేపుతోంది.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో Votersకు  పంపిణీ చేసేందుకు కవర్లలో డబ్బులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడడానికి ముందు రోజే ఓటర్లకు పంపిణీ చేసేందుకు కవర్లలో డబ్బులు పెడుతున్న వీడియో నెట్టింట్లో పోస్టు చేశారు. మరో వైపు ఇద్దరు మహిళలు ఓ కవర్ నుండి డబ్బులు తీస్తున్న వీడియోలు కూడ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని వీణవంక మండలం గంగారం గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున గుమికూడి తమకు ఎందుకు డబ్బులు ఇవ్వరని  ప్రశ్నించారు. ఇదే గ్రామానికి చెందిన కొందరికి డబ్బులు ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

మాజీ మంత్రి Etela Rajenderఈ ఏడాది జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సుమారు నాలుగు మాసాల నుండి ఈ స్థానంలో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్ధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ప్రకటించింది.ఈ స్థానం నుండి 2009 నుండి ఈటల రాజేందర్ Trs అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే  మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేయడంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి Bjpలో చేరారు. ఈ దఫా ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా Gellu Srinivas Yadavపోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా Balmuri Venkat బరిలో నిలిచారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios