హుజూరాబాద్ ఉప ఎన్నికను నిలిపివేయాలని సీఈసీని కాంగ్రెస్ పార్టీ కోరనుంది.ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సీఈసీతో భేటీ కానున్నారు. 

కరీంనగర్: Huzurabad bypollను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ కోరనుంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారని బీజేపీ, టీఆర్ఎస్‌లపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇవాళ సాయంత్రం సీఈసీని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించనున్నారు.ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికకు రెండు రోజుల ముందు Congress పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో Votersకు పంపిణీ చేసేందుకు కవర్లలో డబ్బులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మాజీ మంత్రి Etela Rajenderఈ ఏడాది జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సుమారు నాలుగు మాసాల నుండి ఈ స్థానంలో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్ధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ప్రకటించింది.

Also Read:Huzurabad Bypoll: మా సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది... ఈటలదే బంపర్ మెజారిటీ: బండి సంజయ్

ఈ స్థానం నుండి 2009 నుండి ఈటల రాజేందర్ Trs అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేయడంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి Bjpలో చేరారు. ఈ దఫా ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా Gellu Srinivas Yadavపోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా Balmuri Venkat బరిలో నిలిచారు.

ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడడానికి ముందు రోజే ఓటర్లకు పంపిణీ చేసేందుకు కవర్లలో డబ్బులు పెడుతున్న వీడియో నెట్టింట్లో పోస్టు చేశారు. మరో వైపు ఇద్దరు మహిళలు ఓ కవర్ నుండి డబ్బులు తీస్తున్న వీడియోలు కూడ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ నియోజకవర్గంలోని వీణవంక మండలం గంగారం గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున గుమికూడి తమకు ఎందుకు డబ్బులు ఇవ్వరని ప్రశ్నించారు. ఇదే గ్రామానికి చెందిన కొందరికి డబ్బులు ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసం బీజేపీ, టీఆర్ఎస్ లు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. డబ్బులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నందున ఈ ఉప ఎన్నకను నిలిపివేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కలిసి వివరించనుంది. ఇవాళ సాయంత్రం సీఈసీని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించనున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ, టీఆర్ఎస్‌లున్నాయి. ఇందు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఉండేందుకు టీఆర్ఎస్ అన్ని వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు సవాల్ విసిరేందుకు కమల దళం సమాయత్తమైంది.

గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన సమయంలో ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సమయంలో కూడా పెద్ద ఎత్తున నగదు పంపిణీ కలకలం రేపింది. ఈ విషయమై అప్పట్లో కొన్ని పార్టీలు ఈసీని కలిసి నగదు పంపిణీపై ఫిర్యాదు చేశాయి. ఈ అంశాలన్నింటిని పరిశీలించిన ఈసీ ఉప ఎన్నికను వాయిదా వేసింది.