కేటీఆర్ కు ఉత్తమ్ ట్వీట్ : వెంటనే స్పందించిన కేటీఆర్

telangana congress president uttam kumar reddy tweeted minister ktr
Highlights

ఉత్తమ్ డిమాండ్ ను నెరవేర్చాలని కలెక్టర్ కు ఆదేశం

రాజకీయాలు వేరు...ప్రజా సమస్యలు వేరని మంత్రి కేటీఆర్, టీ కాంగ్రెస్ అద్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి నిరూపించారు. రాజకీయాల్లోనే తాము ప్రత్యర్థులం కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాదని వారు నిరూపించారు. కొమురం భీం జిల్లాలో ఓ వృద్ద దంపతుల బాధ గురించి ఉత్తమ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, అంతే సానుకూలంగా కేటీఆర్ స్పందించారు. వెంటనే ఆ సమస్య పరిష్కారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 


ఇంతకూ ఏం జరిగిందంటే... కొమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని కర్జెల్లి లోని ఎస్టీ కాలనీలో వృద్ధ దంపతులు ఓ గుడిసెలో నివాసముంటున్నారు. అయితే వీరు సరైన కూడూ, గుడ్డకు అష్ట కష్టాలు పడుతుండగా స్థానిక అధికారులు వీరు నివసిస్తున్న గుడిసెపై రూ.500 ఇంటి పన్నును విధించారు. దీన్ని వీరు చెల్లించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. 

ఈ ఘటన గురించి తెలుసుకున్న టీ కాంగ్రెస్ అద్యక్షులు ఉత్తమ్‌ స్పందించారు. ఈ వృద్ద దంపతులు గుడిసెలె వున్న ఫోటోతో పాటు, ఇంటి పన్ను రశీదును మంగళవారం సీఎంవో కార్యాలయానికి, మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.  వెంటనే ఈ వృద్ద దంపతులకు సహాయం చేయాలని, వారి డబ్బులు తిరిగిచ్చి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టియ్యాలని సూచించారు. 

ఈ ట్వీట్ ను చూసిన మంత్రి ప్రజా సమస్యలను తెలియజేసినందుకు ఉత్తమ్ ను అభినందించారు. అలాగే ఈ వృద్ద దంపతుల పట్ల స్థానిక పంచాయతీ కార్యదర్శి చేసిన పొరపాటును సరిదిద్దాలని, వారికి ప్రభుత్వం తరపున డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఆసరా పెన్షన్‌ మంజూరు చేయించాలని  జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.   

 

 

 

loader