జీహెచ్ఎంసీపై ఫోకస్: కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...


జీహెచ్ఎంసీ పరిధిపై  కాంగ్రెస్ కేంద్రీకరించింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి  అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలోపేతంపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
 

Telangana Congress Plans to Strengthen party in GHMC lns


 హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.  త్వరలోనే  పార్లమెంట్ ఎన్నికలు  జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో  బలహీనంగా ఉన్న ప్రాంతాలపై  ఆ పార్టీ కేంద్రీకరించింది. 

గత ఏడాది నవంబర్ లో జరిగిన   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో   భారత రాష్ట్ర సమితి  అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కలేదు. దీంతో  జీహెచ్ఎంసీ పరిధిలోని  అసెంబ్లీ స్థానాలపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

also read:స్వామిగౌడ్‌తో పొన్నం ప్రభాకర్ భేటీ: కాంగ్రెస్‌లోకి ఆహ్వానం?

ఈ ఏడాది ఏప్రిల్ లో   పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.  పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహారచన చేస్తుంది.

పార్లమెంట్ నియోజకవర్గాలకు  మంత్రులను  ఇంచార్జీలుగా నియమించారు.  మరో వైపు  పలు జిల్లాలకు  ఇంచార్జీ మంత్రులను  నియమించారు. హైద్రాబాద్ జిల్లాకు  పొన్నం ప్రభాకర్ ను  ఇంచార్జీ మంత్రిగా నియమించారు. 

పార్లమెంట్ ఎన్నికల నాటికి జీహెచ్ఎంసీ పరిధిలోని  అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ కసరత్తును ప్రారంభించింది.  ఈ మేరకే  హైద్రాబాద్ పరిధిలోని పలు పార్టీల్లోని అసంతృప్తులు, ప్రముఖులతో  పొన్నం ప్రభాకర్  సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

గత వారంలోనే  తెలుగు దేశంలో కీలకంగా పనిచేసిన, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ తో  మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు .దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులతో  పొన్నం ప్రభాకర్  లంచ్ భేటీ నిర్వహించారు.  దేవేందర్ గౌడ్ తనయుడు  వీరేందర్ గౌడ్ గతంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో  దేవేందర్ గౌడ్ తనయుడు  బీజేపీలో చేరారు.

also read:వై.ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు: సవాళ్లు ఇవీ

దేవేందర్ గౌడ్ తో భేటీ తర్వాత  ఇవాళ తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. స్వామి గౌడ్ ను  కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానించినట్టుగా  ప్రచారం సాగుతుంది. అయితే  ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.

హైద్రాబాద్ పై  పట్టు పెంచుకునేందుకు  కాంగ్రెస్ పార్టీ  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రం గౌడ్ ఇటీవలనే బీజేపీకి రాజీనామా చేశారు. విక్రంగౌడ్  కాంగ్రెస్ పార్టీలో చేరుతారని  కూడ చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ  గోషామహల్ అసెంబ్లీ ఇంచార్జీ పదవిని  విక్రం గౌడ్ కు  ఇస్తారనే  చర్చ కూడ సాగుతుంది. 

మరో వైపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి  మాజీ ఎమ్మెల్యే ఒకరితో కాంగ్రెస్ నేతలు  టచ్ లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగుతుంది.  హైద్రాబాద్ పరిధిలోని ఇతర పార్టీల్లో అసంతృప్తులపై కూడ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.  పార్లమెంట్ ఎన్నికల నాటికి  క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై  కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతుంది. 

also read:బీజేపీకి పురంధేశ్వరి, కాంగ్రెస్‌కు వై.ఎస్. షర్మిల: రెండు జాతీయ పార్టీలను లీడ్ చేస్తున్న ఉద్ధండుల కూతుళ్లు

తెలంగాణ రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని  కనీసం  12 స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో  తెలంగాణలో  మూడు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  2019లో  తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది.  అయితే  ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో  పార్లమెంట్ ఎన్నికలపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios