కాంగ్రెస్ టిక్కెట్లకు ముగిసిన గడువు: అప్లికేషన్ ఇచ్చిన ప్రముఖులు వీరే

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ధరఖాస్తు చేసుకొనేందుకు ఇవాళ్టితో గడువు ముగిసింది.  టిక్కెట్ల కోసం పలువురు  నేతలు గాంధీభవన్ లో తమ ధరఖాస్తులను సమర్పించారు.

 Telangana Congress Leaders  Applied  For Tickets From Various Assembly Segments lns


హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  కాంగ్రెస్ ప్రముఖులు  టిక్కెట్ల కోసం ధరఖాస్తు చేసుకున్నారు.  ఈ ధరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి ఎన్నికల కమిటీకి ఒక్క పేరును  పంపనుంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది.

also read:కాంగ్రెస్ టిక్కెట్లకు ధరఖాస్తులు: ఒకే స్థానానికి ఒకే కుటుంబం నుండి అప్లికేషన్లు

ఈ నెల  18వ తేదీ నుండి ఇవాళ్టి వరకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ధరఖాస్తులను ఆహ్వానించింది. పార్టీ టిక్కెట్ల కోసం  ధరఖాస్తులను స్వీకరించింది ఆ పార్టీ.  ఇవాళ్టితో ధరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. 

కొడంగల్- రేవంత్ రెడ్డి
హుజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ- ఎన్.పద్మావతి
హుజూరాబాద్- బల్మూరి వెంకట్
ముషీరాబాద్-అంజన్ కుమార్ యాదవ్, అనిల్  కుమార్ యాదవ్
ములుగు-సీతక్క
పినపాక-సూర్యం(సీతక్క తనయుడు)
ఖానాపూర్- రేఖానాయక్ (ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే)
ఆసిఫాబాద్- శ్యాం నాయక్(రేఖానాయక్ భర్త)
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మధిర-మల్లు భట్టి విక్రమార్క
సత్తుపల్లి-మానవతారాయ్
వనపర్తి-మేఘారెడ్డి
నాగార్జునసాగర్-రఘువీర్, జయవీర్(జానారెడ్డి కొడుకులు)
జహీరాబాద్- ఎ.చంద్రశేఖర్
మిర్యాలగూడ-రఘువీర్
కరీంనగర్-రమ్యారావు, రితేష్ రావు
జగిత్యాల-జీవన్ రెడ్డి
ఆంథోల్-దామోదర రాజనర్సింహ, త్రిష
కంటోన్మెంట్-సర్వే సత్యనారాయణ
ఎల్ బీనగర్-మధు యాష్కీ
కామారెడ్డి-షబ్బీర్ అలీ
వికారాబాద్-ప్రసాద్
ఇబ్రహీంపట్టణం-మల్ రెడ్డి రంగారెడ్డి
పరిగి-రామ్మోహన్ రెడ్డి
మంథని-శ్రీధర్ బాబు
చొప్పదండి-ఎం.సత్యం
పెద్దపల్లి-విజయరమణరావు
వరంగల్ ఈస్ట్-కొండా సురేఖ
భూపాలపల్లి-గండ్ర సత్యనారాయణ
అచ్చంపేట-వంశీకృష్ణ
నిర్మల్-శ్రీహరిరావు
నిజామాబాద్ అర్బన్-మహేష్ కుమార్ గౌడ్
జుక్కల్-గంగారాం
ధర్మపురి-లక్ష్మణ్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (మూడు అసెంబ్లీ స్థానాల నుండి ధరఖాస్తు చేసుకున్నారు.)కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం అసెంబ్లీ స్థానాల నుండి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధరఖాస్తు చేసుకున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios