కాంగ్రెస్ టిక్కెట్లకు ధరఖాస్తులు: ఒకే స్థానానికి ఒకే కుటుంబం నుండి అప్లికేషన్లు
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం ఒకే అసెంబ్లీ స్థానం నుండి ఒకే కుటుంబం నుండి ఇద్దరు సభ్యులు ధరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం ఒకే అసెంబ్లీ స్థానం నుండి ఒకే కుటుంబం నుండి ఇద్దరేసి చొప్పున అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ టిక్కెట్లు కోసం ధరఖాస్తు చేసుకొనేందుకు ఇవాళే చివరి రోజుల. పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలంతా ధరఖాస్తు చేసుకోవాల్సిందే.ఇవాళ్టి వరకు సుమారు 800 కు పైగా ధరఖాస్తులు వచ్చినట్టుగా సమాచారం.
హైద్రాబాద్ లోని ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆయన తనయుడు అనిల్ కుమార్ కూడ ధరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్యారావుతో పాటు ఆమె తనయుడు రితేష్ రావు నామినేషన్ దాఖలు చేశారు.మిర్యాలగూడ, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జానారెడ్డి కొడుకు రఘువీర్ ధరఖాస్తు చేసున్నారు.జానారెడ్డి మరో తనయుడు జయవీర్ నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి నిన్న ధరఖాస్తు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో , ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుండి పోటీ చేసి జానారెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ దఫా ఎన్నికల్లో పోటీకి జానారెడ్డి ఆసక్తిని చూపడం లేదు. దీంతో తన ఇద్దరు కొడుకులను నాగార్జునసాగర్, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాల నుండి బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ ధరఖాస్తులు చేసుకున్నారు.
ములుగు అసెంబ్లీ స్థానానికి సీతక్క ధరఖాస్తు చేసుకున్నారు. పినపాక అసెంబ్లీ స్థానానికి ఆమె కొడుకు సూర్యం ధరఖాస్తు చేశారు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ధరఖాస్తు చేసుకున్నారు. ఆంథోల్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఆయన కూతురు త్రిష నామినేషన్ దాఖలు చేశారు. మధిర అసెంబ్లీ స్థానం నుండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధరఖాస్తు చేసుకోనున్నారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎంపీ మధు యాష్కీ పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు.