పెగ్గేస్తే ఫ్రంట్ ఏదో బ్యాకేదో తెలియదు.. థర్డ్ ఫ్రంట్ అవసరమా: రేవంత్ రెడ్డి

పెగ్గేస్తే ఫ్రంట్ ఏదో బ్యాకేదో తెలియదు.. థర్డ్ ఫ్రంట్ అవసరమా: రేవంత్ రెడ్డి

మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌తో గెలిచిన కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేంద్రంలో మోదీ పాలన కొనసాగుతుంటే.. రాష్ట్రంలో కేడీ (కల్వకుంట్ల దోపిడి) పాలన సాగుతోందని విమర్శించారు. బుధవారం (మార్చి 7) సిరిసిల్లలో జరిగిన కాంగ్రెస్‌ ప్రజాచైతన్య బస్సు యాత్రకు వెళుతూ.. మార్గమధ్యంలో కామారెడ్డిలోని మాచారెడ్డి చౌరస్తాలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా రేవంత్ కేసీఆర్, కేటీఆర్ పైనా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కామెంట్స్ పైనా చాలా ఘాటుగా రియాక్షన్ ఇచ్చారు. రెండు పెగ్గులేస్తే ఫ్రంట్ ఏదో, బ్యాక్ ఏదో తెలియని కేసీఆర్‌కు థర్డ్ ఫ్రంట్ అవసరమా అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ‘తెలంగాణలో ఆంధ్రోడి పెత్తనం ఏందంటూ తెలంగాణకు సీఎం అయ్యాడు. ఇప్పుడు కేంద్రం పెత్తనం ఏంటంటూ ప్రధానిని చేయాలంటున్నాడు. రేపు ప్రజల మీద దేవుడి పెత్తనమేంటంటూ కేసీఆర్ తనను దేవుణ్ని చేయాలంటాడేమో!’ అని రేవంత్ ఎద్దేవా చేశారు.


ఉద్యమ నాయకుడి కుమారుడని గెలిపిస్తే.. కేటీఆర్ సిరిసిల్ల ప్రజల నెత్తినెక్కి కూర్చున్నాడని రేవంత్ విమర్శించారు. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ రూ.150 కోట్ల కమీషన్ కొట్టేశారని ఆరోపించారు. ‘హరీశ్‌రావు నుంచి మైనింగ్ శాఖ గుంజుకుని కేటీఆర్‌కు కట్టబెట్టారు. మరి నా కథేందని సంతోష్‌ రావు అడిగితే.. ఆయనకు ఇసుక రీచ్‌లు అప్పగించారు. ఇప్పుడు ఏకంగా రాజ్యసభకే పంపిస్తున్నారు’ అని రేవంత్ విమర్శించారు.ప్రజా వ్యతిరేకత వెల్లువలా వీస్తోందని, సీఎం కేసీఆర్‌‌కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని రేవంత్ అన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా అన్ని వర్గా ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌ కుటుంబానికి ఇవే చివరి ఎన్నికలని రేవంత్ జోస్యం చెప్పారు.

  • పవన్ ఫ్యాన్స్ కు చేదు వార్త..  పవన్ ఇంట విషాదం.. https://goo.gl/WHnKiy

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page