పీసీసీ ప్రధాన కార్యదర్శుల తీరుపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ థాక్రే. ప్రధాన కార్యదర్శి ఎవరూ ఇప్పటి వరకు నివేదికలు ఇవ్వకపోవడంతో థాక్రేతో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శుల తీరుపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ థాక్రే. వంద మంది ప్రధాన కార్యదర్శులు వుంటే ఏ ఒక్కరూ సమావేశానికి రాలేదన్నారు. ఇది మంచి పద్ధతి కాదని.. ఇలా సమావేశానికి గైర్హాజరైతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సమావేశానికి రాని, అప్పగించిన బాధ్యతలు నేరవేర్చని నేతలను తొలగిస్తామని థాక్రే హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి ఎవరూ ఇప్పటి వరకు నివేదికలు ఇవ్వకపోవడంతో థాక్రేతో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
