తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం Live
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతోంది. రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలతో గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు జాతీయస్థాయిలో కీలక నాయకులు పాల్గొన్నారు.
- గవర్నర్ తో సీఎం రేవంత్, మంత్రులతో ఫోటో గ్రూఫ్ ఫోటో అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసింది.
- మంత్రుల ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భార్యతో కలిసివెళ్ళి సోనియాగాంధీకి పాదాభివందనం చేసారు.
- జూపల్లి కృష్ణారావు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.
- తమ్ముల నాగేశ్వరరాావుతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.
- ప్రమాణం అనంతరం సీతక్కను ఆలింగనం చేసుకుని అభినందించారు సోనియా గాంధీ
- సీతక్క మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆమె ప్రమాణం చేస్తున్నంతసేపు కాంగ్రెస్ శ్రేణుల కరతాళధ్వనులు ఎల్బీ స్టేడియంలో మిన్నంటాయి.
- మంత్రిగా కొండా సురేఖ ప్రమాణస్వీకారం చేసారు.
- పొన్నం ప్రభాకర్ తో గవర్నర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆయన ప్రమాణం చేస్తున్నంతసేపు కరళాల ధ్వనులు మిన్నంటాయి.
- దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో గవర్నర్ తమిళిసై మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.
- దామోదర రాజనర్సింహ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమ ప్రాంగణానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేరుకున్నారు. వారిని రేవంత్ రెడ్డి స్వయంగా స్వాగతం పలికారు.
- ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ తదితరులు తెలంగాణ సీఎం రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో హాజరయ్యారు.
- తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకార వేదికపైకి చేరుకున్నారు.
- రేవంత్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.
- రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్నంతసేపు కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
- రేవంత్ రెడ్డికి గవర్నర్ తమిళిసై పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణంస్వీకారం చేయించారు. మొదట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేసారు.
- ఉత్తమ్ కుమార్ రెడ్డితో గవర్నర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ఇక్కడ చూడండి.