కేసీఆర్ ను లాకప్ లో పెట్టేది... లాఠీలతో కొట్టేది ఈ పిల్లలే : సీఎం రేవంత్ వార్నింగ్

ఇటీవల కేసీఆర్ వీపు చింతపండు కాకుండా పోలీసులు అడ్డుకున్నారని సీఎం రేవంత్ అన్నారు. కానీ ఆయన మోకాళ్లచిప్పలపై కొట్టుకుంటూ తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఖాయమని హెచ్చరించారు. అది చేసేది ఎవరో కూడా సీఎం తెెలిపారు. 

Telangana CM Revanth Reddy Strong warning to BRS Chief KCR AKP

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొట్టుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెడతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పోలీస్ ఉద్యోగాలు పొందిన బిడ్డలే కేసీఆర్ మోకాళ్లచిప్పలపై లాఠీలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళే రోజు వస్తుందన్నారు. తన కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని బలిచ్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... అందువల్లే గత ఎన్నికల్లో ఓడించారని అన్నారు. ఇక ఎప్పుడూ ఆయన అధికారంలోకి రాలేరని... పోలీస్ ఉద్యోగాల్లో చేరుతున్న ఈ పిల్లలే కేసీఆర్ కు గుణపాఠం చెబుతారని సీఎం రేవంత్ హెచ్చరించారు.   

ఇటీవల పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల పొందిన యువతీయువకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ నల్గొండ బిఆర్ఎస్ సభలో కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను ఓడించి మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నారు... కానీ ఈ ఐదేళ్లే కాదు ఆ తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా వుంటానన్నారు. కేసీఆర్ తన వెంట్రుక కూడా పీకలేడని కేసీఆర్ అన్నారు. 

రా బిడ్డా... ఎట్ల అధికారంలోకి వస్తావో చూస్తాను... నీ సంగతేందో చూస్తానంటూ కేసీఆర్ కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ యువత చేతికి పెత్తనం ఇస్తున్నా... ఇకపై ఎట్ల తిరుగుతావో చూస్తానంటూ హెచ్చరించారు. ఏం తనను చంపుతారా అని కేసీఆర్ అంటున్నారు... సచ్చిన పామును చంపాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ ప్రజలు కట్టెలతో కొట్టిచంపారని... దీంతో ఖేల్ ఖతం దుకాణం బంద్ అయ్యిందన్నారు. తన గురించి ప్రజలకు తెలిసిపోయిందని పసిగట్టిన కేసీఆర్ సానుభూతి నాటకం ఆడుతున్నాడు... అందులో భాగమే వీల్ ఛైర్, కట్టె పట్టుకుని నడవమని అన్నారు. మిగతా సమయాల్లో బాగానే నడుస్తున్నాడు... ప్రజల్లోకి వస్తే మాత్రం వీల్ చైర్ కూర్చుంటున్నాడంటూ కేసీఆర్ పై సీఎం సెటైర్లు వేసారు. 

Also Read  జనం కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారు : కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా రేవంత్ చురకలు అంటించారు. ఇప్పటికే ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసామని...  చిక్కుముడులను కూడా ఒక్కోటిగా విప్పుతున్నామన్నారు. ఎవరు అడ్డుపడ్డా ఉద్యోగ నియామకాలు కొనసాగుతాయని... నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. మాజీ మంత్రి హరీష్ ఎక్కడైనా కనిపిస్తే మా రేవంతన్న దగ్గరకు వెళ్లామని ... ఆయన అండగా నిలబడ్డాడని చెప్పాలని యువతీయువకులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios