జనం కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారు : కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్
బీఆర్ఎస్ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. తెలంగాణ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి, రేసుగుర్రాన్ని తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
మంగళవారం నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నారని నిన్న కేసీఆర్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి, రేసుగుర్రాన్ని తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారో.. నేను చూస్తానని , పదేళ్లు అధికారంలో వుంటా.. ప్రజలు ఆమోదిస్తే మరో 10 ఏళ్లు వుంటానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రానివారికి అధికారం ఎందుకు అన్న సీఎం.. ఢిల్లీతో కొట్లాడతామంటే కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావడం లేదని దుయ్యబట్టారు.
ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే.. 22 నెలలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని.. గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు దృష్టి పెట్టలేదని సీఎం ఎద్దేవా చేశారు. మీ సంతోషంలో మేము భాగస్వాములం అయ్యేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇంటికే నియామక పత్రాలు పంపొచ్చు కదా అని హరీశ్ రావు అంటున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ తన బంధువులకు అనేక పదవులు కట్టబెట్టారని.. మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించిందన్నారు.
అసెంబ్లీలో చర్చకు రమ్మంటే రారు కానీ.. నల్గొండలో సభకు మాత్రం కేసీఆర్ వెళ్లారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. చంపుతారా చంపండి అని కేసీఆర్ అంటున్నారు.. ఆయన చచ్చిన పామని రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ ఆడే డ్రామాలను అందరూ చూశారని.. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాదన్నారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఉద్యోగాలు కల్పిస్తున్నామని.. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా జలాలపై గత సీఎం పెట్టిన సంతకమే.. రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇంటి నుంచి బయటకు రావడం లేదు