Asianet News TeluguAsianet News Telugu

మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై విచారణకు కేసీఆర్ ఆదేశం

దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాకప్‌డెత్ పై విచారణకు ఆదేశించారు  సీఎం.
 

Telangana CM orders to probe on Mariyamma custodial death lns
Author
Hyderabad, First Published Jun 25, 2021, 7:42 PM IST

హైదరాబాద్:దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.లాకప్‌డెత్ పై విచారణకు ఆదేశించారు  సీఎం.అడ్డగూడూరులో  కస్టోడియల్ డెత్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం నాడు  సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి సీఎం కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.

also read:మరియమ్మ కొడుకుకు ఉద్యోగం: కేసీఆర్‌తో సీఎల్పీ నేత భట్టి భేటీ

లాకప్‌డెత్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయవద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఇలాంటి ఘటనలు క్షమించనని సీఎం తేల్చి చెప్పారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ విషయమై నిజనిర్ధారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే వారిని ఉద్యోగంలో నుండి తొలగించాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమన్నారు.మరియమ్మ కొడుకు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకొంటుందని  సీఎం హామీ ఇచ్చారు.

మరియమ్మ కుటుంబానికి రూ. రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని సీఎం ఆదేశించారు. ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం ఇవ్వాలని కూడ సీఎం కోరారు. బాధితులను డీజీపీ పరామర్శించి కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలన్నారు.ఈ నెల 28న సీఎల్పీ నేత భట్టి తో కలిసి స్థానిక ప్రజా ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని సీఎం ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios