Asianet News TeluguAsianet News Telugu

మరియమ్మ కొడుకుకు ఉద్యోగం: కేసీఆర్‌తో సీఎల్పీ నేత భట్టి భేటీ

కస్టోడియల్ డెత్ కు గురైన మరియమ్మ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

CLP leader Mallu bhatti vikramarka meets cm kcr lns
Author
Hyderabad, First Published Jun 25, 2021, 6:28 PM IST

హైదరాబాద్: కస్టోడియల్ డెత్ కు గురైన మరియమ్మ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

 కస్టోడియల్ డెత్ కు గురైన మరియమ్మ కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తాము చేసిన డిమాండ్ విషయమై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. మరియమ్మ కుటుంబానికి ఇల్లు కూడ ఇచ్చేందుకు సీఎం అంగీకరించారన్నారు.మరియమ్మ బిడ్డలకు ఆర్ధిక సహాయం చేయాలని తాము చేసిన వినతికి సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. "

also read:కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో ప్రయోజనమే లేదు.. విరుచుకుపడ్డ భట్టి..

రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. లాకప్‌డెత్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశం గురించి తాము సీఎం దృష్టికి తీసుకెళ్తే ఆయన సీఎస్, డీజీపీని పిలిపించి తమ మధ్య ఈ విషయమై చర్చించారన్నారు.

మరియమ్మ లాకప్‌డెత్ విషయమై  రెండు మూడు రోజుల క్రితమే సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినట్టుగా ఆయన చెప్పారు. అయితే తమకు సీఎం ఇవాళ సమయం ఇచ్చారన్నారు.తెలంగాణకు రెండో దఫా కేసీఆర్ సీఎం అయిన తర్వాత సీఎల్పీ బృందానికి తొలిసారిగా  కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో సీఎంతో సీఎల్పీ నేతలు సమావేశం కావడం పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios