Asianet News TeluguAsianet News Telugu

k chandrashekar rao : కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం.. రోజుల వ్యవధిలో మూడోసారి

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. గడిచిన కొద్దిరోజుల్లో కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మూడోసారి. ఇప్పటికే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లలో ఇలాంటి సమస్యే ఆయనకు ఎదురైన సంగతి తెలిసిందే. 
 

telangana cm KCRs Helicopter Develops Technical Problem ksp
Author
First Published Nov 15, 2023, 5:47 PM IST | Last Updated Nov 15, 2023, 5:53 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది.  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గోన్నారు కేసీఆర్. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు హెలికాఫ్టర్‌లో బయల్దేరగా చాపర్ మొరాయించింది. గడిచిన కొద్దిరోజుల్లో కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మూడోసారి. ఇప్పటికే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లలో ఇలాంటి సమస్యే ఆయనకు ఎదురైన సంగతి తెలిసిందే. 

అంతకుముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ అంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసే ముందు అభ్యర్ధులు వారి పార్టీల చరిత్ర చూడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

ALso Read: K Chandrashekar Rao : 2014లో తెలంగాణ తలసరి ఆదాయమెంత.. ఇప్పుడెంత , ఆలోచించి ఓటేయ్యండి : కేసీఆర్

ప్రజలు తమ చేతిలో వున్న వజ్రాయుధాన్ని సరిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమని కేసీఆర్ తెలిపారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గమనించాలని ఆయన పేర్కొన్నారు. పదేళ్ల క్రితం రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంట్ లేదని కేసీఆర్ గుర్తుచేశారు. 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ 18వ ర్యాంకులో వుండేదని సీఎం పేర్కొన్నారు. ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఎదిగిందని కేసీఆర్ చెప్పారు. ఈ పదేళ్లలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని సీఎం వెల్లడించారు. 

పార్టీల నడవడికను చూసి ఓటు వేయాలని.. ప్రజల చేతిలో వున్న విలువైన ఆయుధం ఓటని కేసీఆర్ చెప్పారు. తలరాతను మార్చే ఓటును జాగ్రత్తగా ఆలోచించి వేయాలని సీఎం పేర్కొన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా వుందని.. సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని కేసీఆర్ చెప్పారు. ప్రజల డబ్బును రైతుబంధు రూపంలో వృథా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు వుండాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని.. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ధరణి వుండటం వల్లే రైతుబంధు డబ్బులు వస్తున్నాయని సీఎం చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios