K Chandrashekar Rao : 2014లో తెలంగాణ తలసరి ఆదాయమెంత.. ఇప్పుడెంత , ఆలోచించి ఓటేయ్యండి : కేసీఆర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ 18వ ర్యాంకులో వుండేదని సీఎం పేర్కొన్నారు. ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఎదిగిందని కేసీఆర్ చెప్పారు.

telangana cm kcr slams tpcc chief revanth reddy at brs praja ashirvada sabha in medak ksp

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ అంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసే ముందు అభ్యర్ధులు వారి పార్టీల చరిత్ర చూడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

ప్రజలు తమ చేతిలో వున్న వజ్రాయుధాన్ని సరిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమని కేసీఆర్ తెలిపారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గమనించాలని ఆయన పేర్కొన్నారు. పదేళ్ల క్రితం రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంట్ లేదని కేసీఆర్ గుర్తుచేశారు. 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ 18వ ర్యాంకులో వుండేదని సీఎం పేర్కొన్నారు. ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఎదిగిందని కేసీఆర్ చెప్పారు. ఈ పదేళ్లలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని సీఎం వెల్లడించారు. 

ALso Read: Harish Rao : కరువు, కర్ఫ్యూ వున్నాయా .. 90 శాతం హామీలు నెరవేర్చాం .. కేసీఆర్ ఆ రికార్డ్ కొడతారు : హరీశ్‌రావు

పార్టీల నడవడికను చూసి ఓటు వేయాలని.. ప్రజల చేతిలో వున్న విలువైన ఆయుధం ఓటని కేసీఆర్ చెప్పారు. తలరాతను మార్చే ఓటును జాగ్రత్తగా ఆలోచించి వేయాలని సీఎం పేర్కొన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా వుందని.. సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని కేసీఆర్ చెప్పారు. ప్రజల డబ్బును రైతుబంధు రూపంలో వృథా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు వుండాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని.. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ధరణి వుండటం వల్లే రైతుబంధు డబ్బులు వస్తున్నాయని సీఎం చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios