వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో టైటిల్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఈ ఘనత సాధించిన మొదటి భారత క్రీడాకారిణీగా ఆమె చరిత్ర సృష్టించిందని... యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచిన సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

చైనాలోని గ్వాంగ్‌జూలో జరిగిన ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ నొజోమి ఒకుహారాను ఢీకొట్టిన సింధు.. 21-19, 21-16 సెట్ల తేడాతో టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు గత మ్యాచ్‌ల్లో తనను ఓడించిన ఒకుహారాపై ప్రతీకారం తీర్చుకుంది. ఎక్కడా ఆధిక్యాన్ని కోల్పోకుండా చివరి వరకు కొనసాగించి లోటుగా ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణీగా రికార్డుల్లోకి ఎక్కింది.
 

వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు