Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించిన సింధు విజేతగా నిలిచింది. 

PV Sindhu wins BWF World Tour Finals
Author
China, First Published Dec 16, 2018, 12:05 PM IST

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించిన సింధు విజేతగా నిలిచింది. చైనాలోని గ్వాంగ్‌జూలో జరిగిన ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ నొజోమి ఒకుహారాను ఢీకొట్టిన సింధు.. 21-19, 21-16 సెట్ల తేడాతో టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు గత మ్యాచ్‌ల్లో తనను ఓడించిన ఒకుహారాపై ప్రతీకారం తీర్చుకుంది.

తొలి గేమ్‌లో 14-6తో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహారా పుంజుకుంది.. వరుసగా పాయింట్లు సాధించి స్కోర్‌ను సమం చేసింది.. ఒత్తిడిని ఎదుర్కొన్న సింధుని ఆ తర్వాత జోరు పెంచి వరుస పాయింట్లతో తొలి సెట్‌ను గెలుచుకుంది.

అనంతరం రెండో సెట్‌లోనూ సింధు పైచేయి సాధించింది. ఎక్కడా ఆధిక్యాన్ని కోల్పోకుండా చివరి వరకు కొనసాగించి లోటుగా ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణీగా రికార్డుల్లోకి ఎక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios