హైద్రాబాద్ ట్యాంక్ బండ్‌పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం: ఆవిష్కరించిన కేసీఆర్

హైద్రాబాద్ లో  125 అడుగుల  ఎత్తైన   అంబేద్కర్ విగ్రహన్ని తెలంగాణ  సీఎం  కేసీఆర్  ఇవాళ  ఆవిష్కరించారు.  

Telangana  CM KCR  unveils 125 feet  Ambedkar  Statue  in  Hyderabad  lns


హైదరాబాద్: నగరంలోని   ట్యాంక్ బండ్  వద్ద  ఏర్పాటు  చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహన్ని  తెలంగాణ సీఎం  కేసీఆర్  శుక్రవారంనాడు  ఆవిష్కరించారు. అంబేద్కర్  మనమడు  ప్రకాష్ అంబేద్కర్ తో  కలిసి  ఈ విగ్రహన్ని  కేసీఆర్  ఆవిష్కరించారు.  అంబేద్కర్ విగ్రహన్ని  ప్రకాష్ అంబేద్కర్  విగ్రహన్ని పరిశీలించారు.  విగ్రహం  గురించిన అంశాలను  సీఎం  కేసీఆర్  ప్రకాష్ అంబేద్కర్ కు  వివరించారు. తన మంత్రివర్గ సహచరులు,  అధికారులను  సీఎం కేసీఆర్   ప్రకాష్ అంబేద్కర్ కు  పరిచయం చేశారు. అంబేద్కర్ విగ్రహంపై  హెలికాప్టర్ తో  పూల వర్షం కురిపించారు. 

also read:ప్రగతి భవన్ ‌కు ప్రకాష్ అంబేద్కర్: కేసీఆర్‌తో లంచ్ మీటింగ్

బౌద్ధ గురువుల  ప్రార్ధనల మధ్య  తెలంగాణ  సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించారుఅంబేద్కర్ విగ్రహన్ని  ఆవిష్కరించిన తర్వాత  మ్యూజియాన్ని  పరిశీలించారు.   హైద్రాబాద్ లో  125 అడుగుల  ఎత్తైన అంబేద్కర్  విగ్రహనికి  2016 ఏప్రిల్  14న  సీఎం కేసీఆర్  శంకుస్థాపన  చేశారు.  అంబేద్కర్ విగ్రహం  ఏర్పాటు  కోసం  రాష్ట్ర ప్రభుత్వం  రూ. 146 కోట్లను  ఖర్చు చేసింది. 

ట్యాంక్ బండ్  పై ఎన్టీఆర్ గార్డెన్  పక్కన 11.34 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్  విగ్రహం,  స్మృతివనాన్ని  ఏర్పాటు  చేసింది  ప్రభుత్వం.50 అడుగుల పీఠంతో  పాటు  125 అడుగుల ఎత్తులో  ఈ విగ్రహన్ని  ఏర్పాటు  చేశారు. అంబేద్కర్  జీవితంలో ముఖ్య ఘటనలు , విశేషాలను  తెలిపే  మ్యూజియం , ఫోటో గ్యాలరీని  ఏర్పాటు  చేశారు. 

పద్మభూషణ్ అవార్డు పొందిన  వన్ జీ సుతార్,  ఆయన కొడుకు  అనిల్ సుతార్ లు  అంబేద్కర్  విగ్రహ నమూనాను తయారు చేశారు.  న్యూఢిల్లీలో  ఈ నమూనాలను తయారు  చేయించారు.  న్యూఢిల్లీ నుండి  హైద్రాబాద్ కు తరలించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios