మంచిర్యాలలో ఈ నెల 9 చేతివృత్తిదారులకు రూ. లక్ష సాయం: ప్రారంభించనున్న కేసీఆర్

ఈ నెల  9వ తేదీన  బీసీ సామాజిక వర్గానికి  చెందిన  వృత్తిదారులకు ,చేతివృత్తులు చేసుకొనేవారికి  తెలంగాణ  ప్రభుత్వం   ఆర్ధిక సహాయం అందించనుంది.

Telangana CM KCR To  Launch  Rs .1 Lakh    aid  to practitioners of BC caste occupations lns


హైదరాబాద్:   బీసీ సామాజికవర్గంలోని  కులవృత్తులు,   చేతివృత్తులు  చేసే వారికి  రూ. 1 లక్ష సహయం  చేసే  కార్యక్రమాన్ని  తెలంగాణ ప్రభుత్వం   ఈ నెల  9వ తేదీన ప్రారంభించనుంది. మంచిర్యాల జిల్లాలో  తెలంగాణ సీఎం  కేసీఆర్  ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.  బీసీ వృత్తులు, చేతి వృత్తులవారికి  లక్ష నగదు   ఆర్ధిక సహాయం  అందించనుంది  ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వం  అందించే  ఆర్ధిక సహాయం  కోసం  ధరఖాస్తు  చేసుకునేందుకు  రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ ను  ప్రారంభించింది. https://tsobmmsbc.cgg.gov.in  వెబ్ సైట్ ద్వారా   ధరఖాస్తు  చేసుకోవాలని  రాష్ట్ర ప్రభుత్వం  కోరింది. ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ  పత్రం సహా  33 కాలమ్స్ అప్లికేషన్స్ ను నింపాలి. ఈ ధరఖాస్తులను  పరిశీలించి  రాష్ట్ర ప్రభుత్వం   ఆర్ధిక సహాయం అందిస్తుంది.

 దళిత బంధు తరహలోనే  బీసీల కోసం  ఓ పథకాన్ని  ప్రకటించనున్నట్టుగా  తెలంగాణ సీఎం  కేసీఆర్  గతంలో  ప్రకటించారు.  అయితే  ప్రస్తుతం  వృత్తులు  చేసుకొనేవారికి  రూ. లక్ష  నగదును ఆర్ధిక సహాయం అందించనుంది  ప్రభుత్వం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios