గాంధీజీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ ఉద్యమం సాగిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్స ముగింపు కార్యక్రామలు హైదరాబాద్‌లో జరిగాయి

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్స ముగింపు కార్యక్రామలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో లక్షలాది మంది ఉత్సాహం పాల్గొన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల గొప్పతనం నేటి తరానికి సమగ్రంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ గుర్తుచేశారు. విభిన్న సంస్కృతుల ప్రజలను స్వాతంత్య్రోద్యమం ఏకతాటిపైకి నిలిపిందన్నారు. చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం తెలిపారు. మతోన్మాదుల చేతిలో గాంధీజీ కన్నుమూయటం తీవ్రం విషాదకరమన్నారు. బలహీనతలు, చెడు అలవాట్లు లేని మహోన్నత వ్యక్తి గాంధీ అని మండేలా ప్రశంసించారని కేసీఆర్ గుర్తుచేశారు. 

గాంధీజీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ ఉద్యమం సాగిందని సీఎం అన్నారు. తొలుత తన మార్గాన్ని వ్యతిరేకించిన వారు.. తర్వాత నా మార్గంలోకి వచ్చారని కేసీఆర్ తెలిపారు. గాంధీజీ కలలు గన్నట్లుగా గ్రామ స్వరాజ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలపై గాంధీ ప్రభావం ఎంతో వుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు తెలంగాణను వ్యతిరేకించిన వారే నేడు ప్రశంసస్తున్నారని సీఎం తెలిపారు.

స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించుకున్నామని.. రైతు బంధు ద్వారా అన్నదాతల కళ్లలో వెలుగులు చూస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వగలిగామని.. ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని కేసీఆర్ పేర్కొన్నారు. మనది న్యాయ పథం.. ధర్మపథం.. సకల జనుల సంక్షేమమే సమ్మతం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.