కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూత.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన సీఎం

Telangana CM KCR sister Smt Leelamma Passed away
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి మరణవార్త విని హుటాహుటిన హైదరాబాద్‌కు పయనమయ్యారు.

కేసీఆర్‌కు ఈమె నాలుగో సోదరి.. రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన శంకర్‌రావుతో లీలమ్మకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాంతారావు, మధుసూదన్‌రావు ఉన్నారు.

loader