RTC strike: ఆర్టీసీ ఖతమ్: ఆర్టీసీ సమ్మెపై తేల్చేసిన కేసీఆర్

రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. రోడ్డు రవాణా సంస్థకు తన కంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. 1997-98లో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని 44 కోట్లు లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. 

telangana cm kcr serious comments on rtc strike

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నది పిచ్చి పంథా అంటూ తిట్టిపోశారు. ఆర్టీసీ కార్మికులు దురంహకారంతో అర్థంపర్థం లేని పంథాను ఎన్నుకున్నారని కేసీఆర్ విమర్శించారు. 

హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం ఇచ్చిన విశ్వాసంతో ఆర్టిసి సమ్మెపై కేసీఆర్ తన వైఖరిని మరింత స్పష్టం చెప్పేశారు. ఆర్టీసీ అనేదే ఇకపై వుండదని తేల్చేశారు.

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తాను కష్టపడతానని హామీ ఇచ్చానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. 

ఆర్థికమంది నేపథ్యంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు. దేశాన్ని తీవ్రంగా ఆర్థికమాంద్యం సంస్థ వేధిస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు. 

read more ఉత్తమ్‌కు సై, పద్మావతికి నై, అదే సైదిరెడ్డి విజయం :హుజూర్‌నగర్ ఓటింగ్ సరళి ఇదీ

గతఐదేళ్లలో 21 శాతం అభివృద్ధి చెందితే ఈ ఏడాది 2.3కి పడిపోయామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి 2.3శాతానికి పడిపోయామని ఈసారి చాలా జాగురుకతతో వ్యవహరించాలని బడ్జెట్ రూపకల్పన పుస్తకంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. 

రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. రోడ్డు రవాణా సంస్థకు తన కంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. 1997-98లో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని 44 కోట్లు లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీ సంస్థ అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చారు కేసీఆర్. ఆర్టీసీ అధికారులు కనీసం సమావేశం పెట్టుకునేందుకు కూడా కార్యాలయాలు లేవన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44శాతం జీతాలు పెంచామని అలాగే ఎన్నికలకు ముందు మళ్లీ పెంచామని మెుత్తం నాలుగేళ్లలో 67శాతం కార్మికుల జీతాలు పెంచినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. భారతదేశ చరిత్రలో ఏ ఆర్టీసీ చరిత్రలో నాలుగు సంవత్సరాల వ్యవధిలో 67శాతం జీతాలు పెంచిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని నిలదీశారు.   

read more సైదిరెడ్డి విజయం ప్రభుత్వానికి టానిక్: ఎల్లుండి హుజూర్ నగర్ కు కేసీఆర్

ప్రతీ ఒక్కరూ ప్రతీ సంస్థను ప్రభుత్వంలో కలపమని కోరడం సమంజసం కాదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మరో 57 సంస్థలు ముందుకు వస్తాయన్నారు. ఆర్టీసీ విలీనం అసంబద్ధమైన నిర్ణయమని చెప్పుకొచ్చారు. 

తలకాయమాసిపోయినోడు, పనికిమాలిన రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. బాధ్యతగల ప్రతిపక్షాలు చేయాల్సిన పని ఇదేనా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios