Asianet News TeluguAsianet News Telugu

వరి ధాన్యం కొనుగోలుకై ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా: కేసీఆర్

వరి ధాన్యం కొనుగోలు విషయమై  కేంద్రం సాగతీత వైఖరిని అవలంభిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

Telangana CM Kcr serious Comments on Bjp over paddy issue
Author
Hyderabad, First Published Nov 16, 2021, 7:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్:వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్  విమర్శించారు. మంగళవారం నాడు టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  . పంజాబ్ రాష్ట్రంలో వరి  ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందన్నారు.తెలంగాణలో మాత్రం వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు.యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ఎప్‌సీఐ రాత పూర్వకంగా తెలిపితే కేంద్రం నిరాకరిస్తోందన్నారు. వరి కొనుగోలు విషయమై కేంద్రం సాగతీత ధోరణిని అవలంభిస్తోందని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో తాను ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్ర ఆహార మంత్రిని అడిగానని చెప్పారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని ఆహార శాఖ మంత్రి చెప్పారన్నారు. కానీ ఇంతవరకు తమకు సమాధానం లేదన్నారు.  రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను 6600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీపై కోపంగా ఉన్న రైతులు బీజేపీ నేతలను నిలదీస్తున్నారని కేసీఆర్ తెలిపారు. 

also read:వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణలో కుంభకోణం: బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనం

కేంద్రం నుండి సరైన సమాధానం రాకపోయేసరికి తమ వ్యవసాయ శాఖ మంత్రి యాసంగిలో వరి పంట వేయవద్దని రైతులను కోరినట్టుగా సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే తమ ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ బీజేపీ బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ధాన్యం కొనుగోలు విషయమై స్వయంగా తానే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసినా ప్రయోజనం లేదని సీఎం చెప్పారు. రైతుల ప్రయోజనం కోసం తాము ఎంతకైనా తెగిస్తామని కేసీఆర్  చెప్పారు. రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాము రైతులను పంట మార్పిడి చేసుకోవాలని కోరుతున్నామని కేసీఆర్ తెలిపారు.

 

బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి

వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం  నుండి స్పష్టత లేదన్నారు.  యాసంగిలో వరి ధాన్యం పండించాలని రైతులను bjpరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై తాను కేంద్ర మంత్రితో మాట్లాడానన్నారు.  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డ్రామాలను మొదలు పెట్టారని ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రాళ్లు, కర్రలతో బీజేపీ నేతలు రైతులపై దాడులకు దిగుతున్నారని కేసీఆర్ చెప్పారు. యాసంగిలో వరి పండించాలని చెప్పి ఉంటే రైతులకు  క్షమాపణ చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రైతులపై దాడులు క్షమించదగినవి కాదన్నారు.  టీఆర్ఎస్ కార్యకర్తల్లో లక్షలాది మంది రైతులున్నారని కేసీఆర్ తెలిపారు. యాసంగిలో వరి  పంట వేయాలని bandi sanjay చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ యాసంగిలో రైతులు వరి పండిస్తే  కేంద్రం నుండి ధాన్యం కొనుగోలు చేయించేలా ఆర్డర్ తీసుకొస్తావా అని కేసీఆర్ బండి సంజయ్ ను ప్రశ్నించారు.

ఈ నెల 18 ఇందిరాపార్క్ వద్ద ధర్నా

paddy ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని సీఎం kcr తెలిపారు.తెలంగాణ కేబినెట్ సహా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా ఈ ధర్నాలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహిస్తామన్నారు.ధర్నా నిర్వహించిన తర్వాత రాజ్‌భవన్ కు వెళ్లి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఈ దర్నా తర్వాత కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే తెగించి పోరాటం చేస్తామని కేసీఆర్ తెలిపారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంట్ సహా అన్ని చోట్లా తాము ఆందోళనను కొనసాగిస్తామని కేసీఆర్ తెలిపారు.ధర్నా జరిగిన రెండు రోజుల తర్వాత కేంద్రం నుండి స్పష్టత రాకపోతే స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టత  కోరుతూ  ఈ నెల 17న ప్రధానికి, మంత్రికి లేఖ రాస్తామని సీఎం తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios