Asianet News TeluguAsianet News Telugu

వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణలో కుంభకోణం: బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనం

వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి బీజేపీ ఎంపీ అరవింద్ తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలులో కుంభకోణం చోటు చేసుకొందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణం ఏ క్షణంలోనైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

BJP MP Aravind Kumar sensational comments On Trs Government
Author
Hyderabad, First Published Nov 16, 2021, 6:31 PM IST

న్యూఢిల్లీ: వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఈ కుంభకోణం ఏ క్షణంలోనైనా వెలుగులోకి రావొచ్చని ఆయన చెప్పారు. మంగళవారం నాడు బీజేపీ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. గతంలో తక్కువ ధాన్యం కొనుగోలు చేసి రిజిస్టర్లలో ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసినట్టుగా నమోదు చేసేవారన్నారు. అయితే  ఈ ప్రక్రియకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రక్రియను కంప్యూటరీకరించిందని చెప్పారు. దళారుల అక్రమాల దర్యాప్తుపై fci  నిర్ణయిస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నారని kcr సర్కార్ చెబుతున్న లెక్కలు సరికావని ఆయన చెప్పారు.ఖరీఫ్ లో 60 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందని ఎంపీ aravind తెలపారు.ముఖ్యమంత్రి kcrనిర్ణయాల కారణంగానే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు.త్వరలోనే వేములవాడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావొచ్చన్నారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

also read:రెండో రోజూ అదే తీరు: బండి సంజయ్ టూర్‌కి టీఆర్ఎస్ నిరసన సెగ, ఉద్రిక్తత

paddy ధాన్యం కొనుగోలు అంశంపై bjp, trs మధ్య మాటల యుద్దం సాగుతుంది.  యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని  టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీజేపీ నేతలు మాత్రం వర్షాకాలంలో వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ పై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నెల మొదటి వారం నుండి వరిపై  పోరు అంశం తెర మీదికి వచ్చింది. వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ధర్నాకు దిగారు. యాసంగిలో వరి ధాన్యం పండించాలని  రైతులను కోరారు. అయితే ఈ విషయమై టీఆర్ఎస్ నేతలు బీజేపీపై మండిపడ్డారు కేంద్రం నిర్ణయాన్ని స్థానిక బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. అయితే కేంద్రం నుండి అక్షింతలు పడడంతో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు యాసంగిలో వరి ధాన్యం పండించాలనే డిమాండ్ పై యూ టర్న్ తీసుకొన్నారని టీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో బాయిల్డ్ రైస్ మినహా రా రైస్ కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే పండించేందుకు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు అనకూలిస్తాయని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎంత వరి ధాన్యం దిగుబడి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అంచనా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలను టీఆర్ఎస్ తిప్పికొడుతుంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ టూర్ నిర్వహించడంపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు.  బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణల సమయంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios