కేసీఆర్ భార్య శోభ మోకాలికి ఆపరేషన్: యశోదకు సీఎం, పలువురి పరామర్శ
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆదివారం నాడు సాయంత్రం శోభ ఆసుపత్రిలో చేరారు. యశోద ఆసుపత్రిలో శోభ మోకాలికి ఆపరేషన్ చేశారు. యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్ వెళ్లే అవకాశం ఉంది.
హైదరాబాద్: Telangana సీఎం KCR సతీమణి శోభ సోమాజీగూడలోని Yashoda ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆమె యశోద Hospital లో చేరారు. ఆదివారం నాడు సాయంత్రం కేసీఆర్ సతీమణి శోభ యశోద ఆసుపత్రిలో చేరారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభకు యశోద ఆసుపత్రలో మోకాలికి శస్త్రచికిత్స చేసినట్టు సమాచారం. యశోధ ఆసుపత్రికి కేసీఆర్ వెళ్లే అవకాశం ఉంది.
యశోద ఆసుపత్రిలో మోకాలికి ఆపరేషన్ చేసుకున్న తన భార్య శోభ ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ అడిగి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ చేసుకున్న సీఎం సతీమణి శోభను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు.అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ కు చేరుకున్నారు.
2015 జనవరి 20వ తేదీన యశోద ఆసుపత్రిలో చేరారుతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ. జర్వంతో బాధపడుతున్న సమయంలో అప్పట్లో ఆమెను చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేర్పించారు. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల జ్వరం వచ్చి ఉంటుందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు అప్పట్లో తెలిపారు.2021 నవంబర్ 22న కేసీఆర్ భార్య శోభ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఎయిమ్స్ లో పలు పరీక్షలను నిర్వహించారు.